Gossipsనాగచైతన్య..సోగ్గాడి గెటప్‌లో రఫ్ఫాడిస్తాడా?

నాగచైతన్య..సోగ్గాడి గెటప్‌లో రఫ్ఫాడిస్తాడా?

జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కెరీర్ మరీ జోరుగా ఏమీ సాగడం లేదు. అయినప్పటికీ తనకు నచ్చిన విధంగా కొన్ని మంచి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు చైతూ. ఇప్పటి వరకూ ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం తను చేస్తున్న కొత్త సినిమా ‘ప్రేమమ్’ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు చైతు. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రేమమ్ ట్రైలర్, సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ కొట్టాయి. సాంగ్స్ అయితే ఆల్రెడీ యువ ప్రేక్షకుల సెల్‌ఫోన్స్‌లో రింగ్ టోన్స్‌గా, డయలర్ టోన్స్‌గా సెట్ అయిపోయి మోత మోగుస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే ఆ మధ్య సాగ్గాడే చిన్న నాయన సినిమా హిట్ అయినప్పుడు నాగ్ , అఖిల్, చైతన్యలు సోగ్గాడి గెటప్‌లో మీడియా ముందు హల్చల్ చేశారు. ఇఫ్పుడు అదే హల్చల్ ప్రేమమ్ సినిమాలో కంటిన్యూ చేయబోతున్నాడట నాగచైతన్య. లుంగీ కట్టుకుని ఉన్న నాగచైతన్య పోస్టర్స్ కూడా అదిరిపోతున్నాయి. అలాగే అదే గెటప్‌లో సోగ్గాడు నాగార్జున రేంజ్‌లో అమ్మాయిలను కూడా టీజ్ చేయబోతున్నాడట. ఆ ప్రాసెస్‌లోనే లెక్చరర్ అయిన శృతీ హాసన్‌ని కూడా పొరపాటుగా ర్యాగ్ చేస్తాడని ఆ తర్వాత లవ్‌లో పడతాడని తెలుస్తోంది. చూస్తుంటే అక్కినేని ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సీన్స్ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాతోనైనా తను అనుకున్న సూపర్ హిట్‌ని నాగచైతన్య సాధిస్తాడేమో చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news