Gossipsఎన్టీఆర్ - మహేష్ ఈ హీరోయిన్ ని వద్దన్నారా??

ఎన్టీఆర్ – మహేష్ ఈ హీరోయిన్ ని వద్దన్నారా??

ఈ ఏడాది విడుదల అయిన మొట్ట మొదటి సినిమా – నేను శైలజ. జనవరి 1 2016 న విడుదల అయిన ఈ సినిమా ఈ ఏడాది కి మంచి శుభారంభాన్ని ఇచ్చింది. ఆ సినిమాలో హీరో రామ్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కి కూడా మంచి పేరు వచ్చింది. నాన్న మీద సీరియస్ గా ఉండే హీరోయిన్ పాత్ర చేసిన సురేష్ సినిమా మొత్తం సీరియస్ గానే ఉంటుంది. ఈ సినిమా తరవాత మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం లో ఛాన్స్ కొట్టేసింది అన్నారు కీర్తి . కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఆ తరవాత ఎన్టీఆర్ సినిమా కొసం కొరటాల ఈమెతో స్క్రీన్ టెస్ట్ చేయించాడు అని కూడా న్యూస్ వచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. అంతా న్యూస్ వరకే పరిమితం అయ్యింది గానీ కనీసం ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అసలు ఇప్పటివరకు ఆమె తదుపరి తెలుగు సినిమా అనేదే లేదు. ఆ సినిమా వచ్చి 7 నెలల కావొస్తున్నా మరి తెలుగులో ఎందుకు చేయట్లేదట ఈ పాపాయ్?

” నాకు చాలానే తెలుగు సినిమాలు చెయ్యాలని ఉంది కానీ కథలు నచ్చడం లేదు. దాంతో పాటు డేట్ లు కూడా సర్దడం కష్టంగా ఉంది. తమిళం లో ప్రస్తుతం కథలతో పాటు పెద్ద హీరోల పక్కన రోల్స్ ఒస్తూ ఉండడం తో దృష్టి అటు పెట్టేసాను ” అంటోంది కీర్తి సురేష్. పవన్ కళ్యాణ్ లేదా నానీ సినిమాలలో ఎదో ఒక దాంట్లో అవకాశం కోసం ఆమె మ్యానేజర్ ప్రయత్నాలు చేస్తున్నాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news