Uncategorizedజనతా గ్యారేజ్ సంచలనాలు ఖాయం.. అందుకే ఇప్పుడు వద్దన్న ఎన్టీఆర్ !!

జనతా గ్యారేజ్ సంచలనాలు ఖాయం.. అందుకే ఇప్పుడు వద్దన్న ఎన్టీఆర్ !!

అన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉండి ఉంటే ఈ పాటికి జనతా గ్యారేజ్ హైప్ మామూలుగా ఉండేది కాదు. కొరటాల శివ, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ప్రస్టేజియస్ మూవీ జనతాగ్యారేజ్ ఆడియో రిలీజ్ ఈ నెల 22న ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ డిలే అవ్వడం వళ్ళ జనతా మూవీ రిలీజ్ సెప్టెంబర్‌కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఇఫ్పుడు ఆడియో రిలీజ్‌ను కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే అదే రోజు ఎన్టీఆర్ వారసుడు లిటిల్ యంగ్ టైగర్ అభయ్ రామ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఆ పండగను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ మాత్రం సెలబ్రేషన్స్‌కి అంత సుముఖంగా లేడట. జనతా కోసం ఫుల్ టైం కష్టపడుతూ ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కోెసం టైం స్పెండ్ చేసే పరిస్థితుల్లో లేడు. అందుకే ఇదే విషయాన్ని ఫ్యాన్స్‌కి కూడా కన్వే చేస్తున్నాడట. స్వయంగా తనే కాల్స్ చేసి మరీ ఆడియో రిలీజ్ రోజే పండగ చేసుకుందాం….ఇప్పుడు అభయ్ రామ్ పుట్టినరోజుకు హంగామా అవసరం లేదు అని చెప్తున్నాడట.

ఎన్టీఆర్ కాన్సన్‌ట్రేషన్ మొత్తం కూడా జనతా గ్యారేజ్ పైనే ఉంది. సమంతా, నిత్యామేనన్ లాంటి స్టార్ క్యాస్టింగ్, మలయాళంలో కూడా సినిమాని సూపర్ హిట్ చేయడం కోసం మోహన్ లాల్ లాంటి సూపర్ యాక్టర్….ఇంకా దేవిశ్రీ ప్రసాద్ లాంటి టెక్నీషియన్స్‌తో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలన్న కమిట్‌మెంట్‌తో ఎన్టీఱర్ ఉన్నాడు. కొరటాల శివ కూడా సినిమా బాగా రావడం కోసం తపిస్తున్నాడు. సినిమా బాగా రావడం కోసమే సినిమా రిలీజ్‌ని కూడా పోస్ట్ పోన్ చేశారు. 60 కోట్ల బడ్జెట్‌తో హై ఎండ్ యాక్షన్, మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాహుబలి తర్వాత రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందుకే ఇంత హెక్టిక్ వర్క్, టెన్షన్స్ ఉన్న టైంలో డైవర్ట్ అవ్వకూడదని ఎన్టీఆర్ ప్లాన్ చేశాడు. అందుకే అభయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజే ధూం ధాంగా చేద్దామని ఫ్యాన్స్‌కి చెప్తున్నాడు. ఎన్టీఆర్ కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం ‘జనతా గ్యారేజ్’ సంచలనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే అనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news