Moviesఇట్స్ అఫిషియల్: ఆ సూపర్ హిట్ హీరో సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే..జాక్...

ఇట్స్ అఫిషియల్: ఆ సూపర్ హిట్ హీరో సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే..జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!

శ్రీ లీల ..నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయిన పేరు . అయితే ఒకే ఒక్క సినిమాతో తన తలరాతను తానే మార్చేసుకుంది. అఫ్కోర్స్ స్టార్ హీరో సినిమాలో నటించినప్పటికీ శ్రీ లీల పేరును ఆ రేంజ్ లో ట్రోల్ చేయడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అభిమానులు. అంతకుముందు నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం .. పెద్ద స్టార్ హీరో తో నటించిన ఆ సినిమాలో ఆమెకు పెద్దగా వాల్యూ లేకపోవడం ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం శ్రీలీలకు భారీ దెబ్బేసింది .

ఈ క్రమంలోనే శ్రీలీల పేరును ఐరన్ లెగ్ అంటూ బాగా ట్రోల్ చేశారు . అంతేనా శ్రీ లీలపై బూతుల వర్షం కూడా కురిపించారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఫ్యాన్స్ ఆమెకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాల్లోని హీరోయిన్గా చేస్తే నీకే బాగుంటుంది అంటూ ఆమెను ప్రోత్సహించారు. అప్పటినుంచి అసలు ఒక్క తెలుగు సినిమాకి సైన్ చేయని శ్రీ లీల రీసెంట్ గా ఒక తెలుగు సినిమాకి ఓకే చేసింది . దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది .

గతంలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రీ లీల . ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధపడింది. ధమాకా సినిమాతో ఏకంగా శ్రీ లీల స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కాగా ఇప్పుడు శ్రీ లీల మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రవితేజ కెరియర్ లోనే 75వ సినిమాగా తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది శ్రీలీల . సామజ వర గమన సినిమా రచయిత భాను బొగ్గవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిశ్రమ కాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీ లీల ఆరెంజ్ కలర్ శారీలో అద్దిరిపోయే లుక్స్ లో కనిపించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news