Moviesశ్రీజ - శిరీష్ భరద్వాజ్ విడిపోవడానికి కారణం ఆ మెగా హీరోనా..?...

శ్రీజ – శిరీష్ భరద్వాజ్ విడిపోవడానికి కారణం ఆ మెగా హీరోనా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా డాటర్ శ్రీజను ఏ విధంగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురైన శ్రీజను ఒక్కసారిగా మెగా అభిమానులు సపోర్ట్ చేయడం మెగా హేటర్స్ హేట్ చేయడం హైలైట్ గా మారిపోయింది. శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. లంగ్స్ ప్రాబ్లం కారణంగా ఆయన చికిత్స తీసుకుంటూ వచ్చాడు. చికిత్సకి కూడా ఆయన బాడీ సహకరించకపోవడంతో అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు . ఆయన మృతి వార్త తెలుసుకొని అందరూ బాధపడ్డారు. శ్రీజ మాత్రం ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు .

అయితే ఇలాంటి క్రమంలోనే అసలు ఎందుకు అంత ప్రాణంగా ప్రేమించిన శ్రీజ సురేష్ భరద్వాజ్ నుండి విడాకులు తీసుకుంది..? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలు మరోసారి చర్చించుకుంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ – శ్రీజల ప్రేమాయణానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ మెగా ఫ్యామిలీ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారట.. కోట్లు డిమాండ్ చేస్తూ శ్రీజను డబ్బులు కావాలి అంటూ ఇబ్బంది పెట్టారట . దీంతో శ్రీజ అతగాడి నిజస్వరూపం తెలుసుకొని కుటుంబ సభ్యులకు చెప్పిందట .

ఆ టైంలోనే మెగా బ్రదర్ నాగబాబు అదే విధంగా మిగతా కుటుంబ సభ్యులు శ్రీజకు రియాలిటీ ఏంటో చెప్పి శిరీష్ భరద్వాజ్ దగ్గర నుంచి విడాకులు తీసుకునేలా చేశారట . అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఒకరు చేతిలో మోసపోయింది అని తెలిసి చిరంజీవి బాగా బాధపడ్డారట .. ఆ తర్వాత శ్రీజ తన తప్పు తెలుసుకుని అతగాడికి విడాకులు చేసి తను కన్నా బిడ్డను తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట.. ఆ తర్వాత ఎప్పుడు కూడా శిరీష్ భరద్వాజ్ ను కలిసింది లేదు.. ఆయన గురించి మాట్లాడింది లేదు ..శిరీష్ భరద్వాజ్ కూడా తనకు పుట్టిన బిడ్డను కూడా పట్టించుకోలేదు .. ఇలా మనసు హర్ట్ అయి విరిగిపోయిన శ్రీజ ఆయన మరణించిన కూడా స్పందించలేదు అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news