Movies"అలా చేస్తే లక్ష ఇస్తా"..కల్కి మూవీ పై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ పజిల్..మీరేమైనా...

“అలా చేస్తే లక్ష ఇస్తా”..కల్కి మూవీ పై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ పజిల్..మీరేమైనా ట్రై చేస్తారా?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి అన్న పేరే మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పోపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ది మోస్ట్ మచ్ అవైటెడ్ మూవీ నే ఈ కల్కి . నాగ్ అశ్వీన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగానే కష్టపడి ప్రతి సీను క్షుణ్ణంగా పరిశీలించి.. ఎందరో పెద్ద మనుషులు చేత సజెషన్స్ తీసుకొని మరి ఈ సినిమాను తెరకెక్కించారు .

ఈ సినిమాను అశ్విని దత్.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం గమనార్హం. దాదాపు 600 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేశాడు అశ్విని దత్ అంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి . ప్రమోషన్స్ కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేశారట . కాగా ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ స్పీడ్ పెంచేశారు మేకర్స్ . కాగా ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కల్కి సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ ట్రైలర్ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . అయితే సెకండ్ ట్రైలర్ మాత్రం అభిమానులను ఫిదా చేసేసింది . ఈ ట్రైలర్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సంకేతాలు వచ్చేసాయి. అయితే ఇందులో విజువల్స్ యాక్షన్ సీస్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా కల్కి ట్రైలర్ చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ క్రియేట్ చేశాడు. ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ అందులోని కొన్ని పదాలు ఇచ్చి మధ్యలో లెటర్లను మిస్ చేశాడు . దీనిని ఎవరైతే ముందుగా ఎవరు ఫిల్ చేస్తారో వాళ్ళకి లక్ష ఇస్తానంటూ ఓపెన్ సవాల్ చేశాడు. ప్రెసెంట్ ఈ పజిల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మీరేమైనా ట్రై చేయగలరేమో చూడండి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news