Moviesగూస్ బంప్స్ తెప్పిస్తున్న "కల్కి 2898ఏడి" న్యూ అప్డేట్..అశ్వత్ధామగా స్టార్ హీరో.....

గూస్ బంప్స్ తెప్పిస్తున్న “కల్కి 2898ఏడి” న్యూ అప్డేట్..అశ్వత్ధామగా స్టార్ హీరో.. ఏమున్నాడు రా బాబు(వీడియో)..!!

కోట్లాదిమంది రెబల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ మూవీ కోసం కేవలం జనాలు ..రెబల్ అభిమానులే కాదు .. బడాబడా స్టార్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తెరకెక్కని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటివరకు కల్కి సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అభిమానులకు హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ సినిమా మే 9న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంటుంది . కానీ మే 13న ఎన్నికల సందర్భంగా ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తుంది .

కొత్త తేదీ మే 20వ తేదీన ప్రకటించబోతున్నారట సినీ మేకర్స్ . ఈ క్రమంలోనే సినిమా నుంచి అద్దిరిపోయే గూస్ బంప్స్ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్ . బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ లుక్స్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేస్తూ సరికొత్త గ్లింప్స్ విడుదల చేశారు . ఇందులో ఆయన అశ్వత్ధామగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . చిన్న వీడియో అయినా సరే గూస్ బంప్స్ వచ్చే విధంగా బాగా కట్ చేశాడు డైరెక్టర్ . ఈ వీడియో చూస్తూ ఉంటే కచ్చితంగా సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు రెబల్ అభిమానులు . మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news