Moviesఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ఎఫెక్ట్ : ఆ సినిమా నుంచి తప్పుకున్న...

ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ఎఫెక్ట్ : ఆ సినిమా నుంచి తప్పుకున్న మృణాల్ ఠాకూర్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాంపేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ సినిమాకి సంబంధించిన కూడా ట్రోల్స్ చూశాం.

రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా చేసింది కచ్చితంగా హిట్ అవుతుంది అన్న ధీమాను వ్యక్తం చేసింది. సినిమా ప్రమోషన్స్ లో ఆమె మాటల ఆధారంగానే అది తెలిసిపోతుంది. అయితే ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఫ్లాప్ అవడంతో మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ తెలుగులో ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కథను ఓకే చేసిన సినిమా నుంచి తప్పుకుందట.

జనాలకి ఇలాంటి కథలు నచ్చవు ..ఒకసారి ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ అలాంటి సినిమాలో నటిస్తే ఎక్కడ ఫ్లాప్ అవుతుందో తన కెరియర్ రిస్క్ లో పడుతుందో అని తెలిసి మృణాల్.. ఈ సినిమా నుంచి తప్పుకుందట. ప్రజెంట్ ఇదే వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ ట్రెండ్ అవుతుంది. సీతారామం సినిమా ద్వారా ఓవర్నైట్లో టాప్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ.. మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత ఆమె నటించిన హాయ్ నాన్న కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . కానీ ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ టాక్ అందుకుంది మృణాల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది ఈ ఫ్యామిలీ స్టార్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news