Movies"నేను సినిమాలు తీసిన్నంత కాలం.. నా మూవీలో ఆమె హీరోయిన్".. సుకుమార్...

“నేను సినిమాలు తీసిన్నంత కాలం.. నా మూవీలో ఆమె హీరోయిన్”.. సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సుకుమార్ ..ఓ లెక్కల మాస్టర్ ..త్వరలోనే గోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్న స్టార్ డైరెక్టర్ . ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీబిజీగా గడిపేస్తున్న సుకుమార్ ఆ తర్వాత రామ్ చరణ్తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. వీళ్ల కాంబోలో రంగస్థలం సినిమా వచ్చింది. ఈ సినిమా ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో మనకు తెలిసిందే. మరోసారి ఇదే కాంబో అంటే కచ్చితంగా ఫ్యాన్స్ అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో సుకుమార్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సమంతను ఓ రేంజ్ లో పొగిడేసారు . ఏ స్టార్ డైరెక్టర్ కూడా సమంతని ఈ రేంజ్ లో పొగడలేదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . సమంత నటనను ఆమె టాలెంట్ను సుకుమార్ చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు . అందుకే ఆమెకు పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చాడు . ఆయన సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నంత కాలం సమంత కు ఆయన మూవీలో ఏదో ఒక్క పాత్ర ఇస్తూనే ఉంటాడట.

అంతేకాదు త్వరలోనే తెరకెక్కబోతున్న చరణ్ సుకుమార్ కాంబోలో కూడా మంచి పాత్ర రాసుకొచ్చాడు అని సమాచారం అందుతుంది . సోషల్ మీడియాలో సుకుమార్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. సమంత విడాకుల తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు . ఒకటికి పది సార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అన్న విధంగా ముందుకు దూసుకెళ్తుంది . త్వరలోనే ఆమె టాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్టులో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుం.ది అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న సినిమాలోను ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news