Moviesఓరి దేవుడోయ్.. ఇది కోఇన్సిడెన్సా..? లేక కావాలని ప్లాన్ చేశారా..? రష్మిక...

ఓరి దేవుడోయ్.. ఇది కోఇన్సిడెన్సా..? లేక కావాలని ప్లాన్ చేశారా..? రష్మిక బర్త్‌డే రోజే అలా చేయబోతున్న విజయ్ దేవరకొండ..!

సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్న.. మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటూ వస్తూ వచ్చింది. రీసెంట్గా మరొకసారి విజయ్ రష్మికల మధ్య ప్రేమ ఉంది అని చెప్పుకొస్తున్నారు అభిమానులు .

దానికి మెయిన్ రీజన్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తూ ఉండడమే . పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది . కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు .

ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నాం అంటూ ప్రకటించారు . నిజానికి ఏప్రిల్ 5న ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ చేయాలి. కానీ కొన్నాళ్లుగా దేవర సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అఫీషియల్ రిలీజ్ డేట్ తో దేవర వాయిదా పడిపోయినట్లు క్లారిటీకి వచ్చేసింది. అయితే ఇక్కడ మరొక విషయం రష్మిక మందన్నా పుట్టినరోజు నాడే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడం ఇప్పుడు ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ గా మారింది. కావాలని చేస్తున్నారో..?? లేకపోతే ఇది ఒక కో ఇన్సిడెన్స్ నా..? తెలియదు కానీ విజయ్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news