Moviesఅమ్మ బాబోయ్..ఆ విషయంలో డాడీనే కాపీ కొట్టిన సితార.. వీడియో వైరల్..!

అమ్మ బాబోయ్..ఆ విషయంలో డాడీనే కాపీ కొట్టిన సితార.. వీడియో వైరల్..!

సితార ఘట్టమనేని .. ఈ పేరుకి సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . రీసెంట్గా సితార ఏఎంబి మాల్ లో తన నాన్నగారు నటించిన గుంటూరు కారం సినిమాను రెండవసారి ఫ్రెండ్స్ తో చూసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిహారిక ఏఎంబి మాల్ కి తన ఫ్రెండ్స్ తో వచ్చింది. అక్కడ సరదాగా గడిపింది. అంతేకాదు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ను సితార వేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ అందించింది . ఏఎంబి మాల్ లో సితార ఘట్టమనేని మహేష్ బాబు షర్ట్ వేసుకొని గుంటూరు కారం సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసిన పిక్స్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

అందరూ నాన్న స్టైల్ ని కాపీ కొట్టింది సితార అంటూ ఆమె వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. సితార ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే రికార్డ్స్ బద్దలు కొట్టే విధంగా ఉంది అంటున్నారు అభిమానులు. సంక్రాంతి కానుకగా మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news