Moviesఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటే.. పాన్ ఇండియా హీరోలే కుల్లుకుని...

ఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటే.. పాన్ ఇండియా హీరోలే కుల్లుకుని చచ్చిపోయేలా చేసిన చిరంజీవి.. హ్యాట్సాఫ్ బాసూ..!

“అదేదో సినిమాలో చెప్పినట్లు క్లాస్ రూంలో టీచర్ అడిగే ప్రశ్నకు ఏ స్టూడెంట్ అయినా జవాబు ఇస్తాడు.. కానీ ఎగ్జామ్ హాల్లో అంత టెన్షన్ లోను జవాబు కరెక్ట్ గా రాసి పాస్ అయిన వాడే నిజమైన స్టూడెంట్” .. ఈ డైలాగ్ మనం చాలా సినిమాల్లో విని ఉంటాం. మన రియల్ లైఫ్ లో కూడా చాలా సార్లు మన తల్లిదండ్రులు చెప్పి ఉంటారు . కానీ ఇప్పుడు అదే డైలాగును మరోసారి గుర్తు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి పై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. ముసలోడు అయిపోయాడు.. ముసలోడికి ఆ కత్తిలాంటి హీరోయిన్ అవసరమా..? ఇక అంకుల్ పాత్రలు చేసుకోవచ్చు కదా ..? ఈ వయసులో నీకెందుకు ఇలాంటి పనులు ..?? అంటూ చెత్త చెత్తగా ట్రోల్ చేశారు.

సీన్ కట్ చేస్తే అలాంటివి పట్టించుకోని మెగాస్టార్ చిరంజీవి ఏకంగా పాన్ ఇండియా హీరోలు కూడా కుళ్లు కునే స్థాయికి ఎదిగిపోయాడు . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ మెగా కాంపౌండ్ నుంచి లీక్ అయి వైరల్ గా మారింది . ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పూర్తిగా ఫాంటసీ అంశాలతో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కబోతుందట . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఇప్పుడు మెగాస్టార్ కి ఓ ప్రొడ్యూసర్ 100 కోట్లు ఆఫర్ ఇచ్చారట . ఆయన ఊ అంటే రేపే చెక్కు చేతిలో పెడతాను అంటూ కాచుకొని కూర్చున్నాడట . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సురేఖతో కలిసి యుఎస్ వెళ్లారు.

అమెరికాలో చిరంజీవి “బ్రో” చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలుసుకొని సన్మానించారు. అయితే ఈ మీటింగ్ లోనే చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ ఓ ప్రాజెక్టు ఫైనలైజ్ చేయమంటూ బిగ్ ఛాన్స్ ఇచ్చారట. ఆ ప్లేస్ లో మిగతా ఏ హీరో ఉన్నా సరే 100 కోట్ల చెక్ తీసుకునేసేవారు . అయితే చిరంజీవి మాత్రం అలా చేయలేదు. ఇప్పుడు కాదు వశిష్ట సినిమా కంప్లీట్ అవ్వనివ్వండి,, ఆ తర్వాత చూద్దాం అంటూ చెక్కును తాకను కూడా తాకలేదట .

అయితే విశ్వప్రసాద్ మాత్రం చెక్ మీ దగ్గరే పెట్టుకోండి అంటూ బలవంతం చేసిన చిరంజీవి అస్సలు ఒప్పుకోలేదట . పాన్ ఇండియా హీరోలకి ఎవరైనా వంద కోట్లు ఆఫర్ ఇస్తారు. సీనియర్ హీరోస్ కి కూడా 100 కోట్లు ఆఫర్ ఇవ్వడం అంటే అది నిజంగా వాళ్లపై ఉన్న నమ్మకం అనే చెప్పాలి . అలాంటి ఘనత అందుకొని మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . ఈ విషయం పాన్ ఇండియా హీరోలు కుళ్ళు కునేది అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news