Moviesఆ స్టార్ సినిమాలో 'ఎన్టీఆర్‌' గెస్ట్ రోల్..క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన...

ఆ స్టార్ సినిమాలో ‘ఎన్టీఆర్‌’ గెస్ట్ రోల్..క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన రైటర్‌.. నిజంగా ఇది అరాచకమే..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది . ప్రభాస్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది. రీసెంట్గా అదే విషయం పై స్పందించాడు కల్కి ఫ్రీ లాన్స్ రైటర్ కేశవ చంద్ర . ప్రజెంట్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్గా అభిమానులతో ముచ్చటించిన ఆయన సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు .

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కల్కిలో ఎన్టీఆర్ కెమియో రోల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా..? అంటూ ప్రశ్నించాడు. అయితే చాలా ఎక్సలెంట్ గా ఆ విషయానికి ఆన్సర్ ఇచ్చాడు. ” మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి” అంటూ చెప్పుకొచ్చాడు . అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్గా స్పందిస్తున్నారు . ఒకవేళ ఆయన నటించక పోయి ఉంటే.. లేదు అంటూ కరెక్ట్ గా చెప్పేవాడు . అప్పుడే అఫీషియల్ గా స్పందించడం ఇష్టం లేదు .. ఆ కారణంగానే ఆయన ఇలా దాచి ఉండొచ్చు.. కచ్చితంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కెమియో రోల్ చేస్తున్నారు అని.. ప్రభాస్ ఎన్టీఆర్ ల కాంబో అదిరిపోతుంది అని.. ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అని.. ఫ్యాన్స్ ఫుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అంతేకాదు ఈయన సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్నీ కూడా బయటపెట్టారు. ఈ మూవీ మొత్తం మైథాలజికల్ ఎలిమెంట్లు ఆధారంగా తెరకెక్కుతుంది అని.. రామాయణం మహాభారతానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని తెలిపారు. విష్ణుమూర్తి అవతారమే కల్కి .. విష్ణు పదవ అవతారమే కల్కి అలాంటప్పుడు.. విష్ణుమూర్తి ప్రస్తావన కూడా ఉంటుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఒక్క ఆన్సర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. తెరపై ప్రభాస్ ఎన్టీఆర్ ని కలిసి చూస్తే అది అరాచకమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news