Movies"సితార హీరోయిన్ అయితే కచ్చితంగా హీరో ఆయనే ఉండాలి".. ఫ్యాన్స్ డిమాండ్...

“సితార హీరోయిన్ అయితే కచ్చితంగా హీరో ఆయనే ఉండాలి”.. ఫ్యాన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతుంది.. ఉన్న హీరోలు స్టార్ హీరోలు నటన చూసి చూసి జనాలకు బోర్ కొట్టేస్తుంది. కొత్త జనరేషన్ తెరపైకి ఎంట్రీ ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ తరం జనరేషన్ వాళ్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఓ బడా దర్శకుడు దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . రేణు దేశాయ్ నో అంటున్న కూడా పవన్ వారసుడిగా అకీరా ఇండస్ట్రీలోకి రావడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . అంతేకాదు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది. మహేష్ బాబు – నమ్రత పరోక్షకంగా హింట్ ఇచ్చేశారు .

అయితే ఇక్కడే ఫ్యాన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నారు . సితార చదువుకుంటుంది.. అకిరా కూడా చదువుకుంటున్నారు. వీళ్ళు ఇండస్ట్రీలోకి రావడానికి కచ్చితంగా రెండు మూడేళ్లయినా పడుతుంది. అయితే వాళ్లు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చినా సరే సితార హీరోయిన్ అయితే కచ్చితంగా హీరోగా అకీరా ఉండాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళ పిల్లలు కలిసిన నటిస్తే చూడాలి అంటూ ఆశపడుతున్నారు. చూద్దాం మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news