MoviesTL రివ్యూ: రాఘ‌వ‌రెడ్డి ... ఫ్యామిలీస్‌, టీనేజ్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా

TL రివ్యూ: రాఘ‌వ‌రెడ్డి … ఫ్యామిలీస్‌, టీనేజ్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా

టైటిల్‌: రాఘ‌వ‌రెడ్డి
నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు
ఎడిట‌ర్‌: ఆవుల వెంకటేష్
సినిమాటోగ్రఫీ: S. N. హరీష్
మ్యూజిక్‌: సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
నిర్మాతలు: కేఎస్‌. శంకర్ రావ్, జి.రాంబాబు యాదవ్, ఆర్‌. వెంకటేశ్వర్ రావు
రిలీజ్ డేట్‌ : 05, జ‌న‌వ‌రి 2024
దర్శక‌త్వం: సంజీవ్ మేగోటి

శివ కంఠంనేని హీరోగా రాశి, నందిత శ్వేత ప్రధాన పాత్రలలో తెర‌కెక్కిన తాజా సినిమా రాఘవరెడ్డి. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్‌. శంకర్రావు – రాంబాబు యాదవ్ – ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

క‌థ :
రాఘవరెడ్డి ( శివ కంఠంనేని ) ఓ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటారు. అయితే క్రిమినల్స్ ని పట్టుకోవడంలో.. చాలా కష్టమైన కేసులను పరిష్కరించడంలో రాఘవరెడ్డి మంచి ఎక్స్‌ఫ‌ర్ట్. పోలీసులు సైతం రాఘవరెడ్డి సహాయం తీసుకుంటూ ఉంటారు. రాఘవరెడ్డి పనిచేసే కాలేజీలో లక్కీ అలియాస్ మ‌హాల‌క్ష్మి ( నందిత శ్వేత ) స్టూడెంట్ గా జాయిన్ అవుతుంది. తన బిహేవియర్ పొగరుతో రాఘవరెడ్డితో ఆమె ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటికి పరిణామాల అనంతరం రాఘవరెడ్డికి తన కూతురు గురించి ఓ నిజం తెలుస్తుంది.. ఇంతకీ రాఘవరెడ్డి కూతురు ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో దేవకి (రాశి) పాత్ర ఏమిటి ? ఆమెకు రాఘవరెడ్డికి మధ్య సంబంధం ఏంటి అన్నదే ? ఈ సినిమా కథ.

విశ్లేషణ :
కమర్షియల్ కథ‌, కథనాలతో తెరకెక్కిన సినిమా రాఘవరెడ్డి. రెగ్యులర్ యూత్ లవ్ స్టోరీని పక్కన పెట్టిన దర్శకుడు చాలా డిఫరెంట్గా ఈ సినిమాను తెరకెక్కించారు. తల్లి కూతుర్లు, భార్యాభర్తల సెంటిమెంట్ ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దర్శకుడు సంజీవ్ రాసిన కథాకథనాలు సన్నివేశాలు అన్ని కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉన్నాయి. సినిమాలో ప్రధాన పాత్ర అయిన రాఘవరెడ్డి పాత్ర‌కి సంబంధించిన యాక్షన్, ఎమోషనల్ ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన దేవిక పాత్ర.. ఆమె నిజ జీవితంలోకి రాఘవరెడ్డి దూరమైన సంఘటనలు వారి మధ్య ఉన్న అడ్డంకులు నందిత శ్వేత ట్రాక్ ఇలా రాఘవరెడ్డి సినిమా చాలాచోట్ల మెప్పించింది. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కంఠంనేని తన పాత్రకి తగ్గట్టు చాలా బాగా నటించాడు.

యాక్షన్ సీన్ల‌లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు. నటనాపరంగా సరికొత్తగా కనిపించాడు. ఇక లక్కీ పాత్రకు అవసరమైన యాటిట్యూడ్ నందిత శ్వేత చక్కగా చూపించారు. ఈ పాత్రలో ఆమె అలా ఇమిడిపోయింది. పాటల్లో ఎనర్జీగా స్టెప్స్ వేశారు. డైలాగ్ డెలివరీలో నందిత ఎక్స్ప్రెషన్స్ నెక్ట్స్‌ లెవెల్ అని చెప్పాలి. నందిత తల్లిగా రాశి ఒదిగిపోయారు.. ఎమోషనల్ సన్నివేశాలు ఆమె నటన ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల్లో పోసాని, అజయ్, ప్రవీణ్, అజయ్‌ఘోష్‌, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తమ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు బాగున్నాయి. ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి బాగా గ్లామర్ ఒలకబోసింది. అన్నపూర్ణ, రఘు బాబు పాత్రలు సినిమాకు కీలకం.

సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను దర్శకుడు సంజీవ్ ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. సినిమాలో అన్ని బాగున్నా మంచి ఫీల్ ఉన్న కొన్ని సన్నివేశాలు స్లోగా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్ల న‌రేష‌న్ స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రను పరిచయం చేయటానికి ఆ పాత్రలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయటానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ప్రధాన పాత్రల మధ్య ఎమోషనల్ కంటెంట్ బాగా ఎలివేట్ చేశారు. సినిమాలో రాశి పాత్ర బలంగా ఉంది.. ఆమె చెప్పిన డైలాగులు బాగున్నాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా చూస్తే సినిమాలో యాక్ష‌న్ పార్ట్ చాలా హైలెట్‌గా నిలిచింది. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ యాక్ష‌న్ పార్ట్ సూప‌ర్‌. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఉంది. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు చాలా ఫ్ల‌స్‌. చాలా సీన్ల‌ను బ్యూటిఫుల్‌గా తీశారు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సినిమా ర‌న్ టైం 2 గంట‌లే ఉండ‌డంతో సినిమా సెకండాఫ్‌లో ఉరుకులు ప‌రుగులు పెడుతుంది. నిర్మాతలు K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఇలాంటి స్టోరీని బ‌డ్జెట్ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా తెర‌కెక్కించ‌డం అభినందించాల్సిన విష‌యం.

ఫైన‌ల్‌గా…
రాఘవ రెడ్డి అంటూ వచ్చిన ఈ యాక్షన్, ఎమోషనల్ డ్రామాలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. మెయిన్ ట్రీట్‌మెంట్ బాగున్నా.. సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉండ‌డం చిన్న మైన‌స్‌. శివ కంఠంనేని స్టార్ హీరోల రేంజ్‌లో న‌ట‌న‌లో ఇర‌గ‌దీశాడు. భార్య‌, భ‌ర్త‌ల బంధంతో పాటు తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలీల‌తో పాటు టీనేజ్ అమ్మాయిలు కూడా చూడాల్సిన సినిమా రాఘ‌వ‌రెడ్డి. నాగార్జున‌, వెంక‌టేష్‌, బాల‌య్య లాంటి ఇమేజ్ ఉన్న హీరోలు ఈ సినిమా చేసి ఉంటే ఆ ఫ‌లితం వేరేలా ఉండేది.

రాఘ‌వ‌రెడ్డి రేటింగ్‌ : 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news