Moviesమన శ్రీలీల కట్టుకున్న ఈ బొక్కల చీర కాస్ట్ ఎంతో తెలిస్తే.....

మన శ్రీలీల కట్టుకున్న ఈ బొక్కల చీర కాస్ట్ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..అన్ని లక్షలా..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. గుంటూరు కారం .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా నిర్వహించారు మేకర్స్ . అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల కట్టుకున్న చీర ఇప్పుడు స్పెషల్ గా అందరి అమ్మాయిలను ఆకట్టుకుంటుంది . ఈ చీరలో శ్రీలీల ఇంకా అందంగా కనిపించడంతో అమ్మాయిలు ఈ చీర గురించి చర్చించడం సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ బాటిల్ గ్రీన్ డిజైన్ చీర అక్షరాల లక్ష 59 వేల రూపాయలు అని తెలిసి షాక్ అయిపోతున్నారు . ఇది శ్రీలీల ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకుందట. దీంతో శ్రీలీల టెస్ట్ కి జనాలు ఫిదా అవ్వడమే కాకుండా ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .

నీ టేస్ట్ కి నీ అందానికి ఇండస్ట్రీలో మరికొంత కాలం నువ్వు కొనసాగడం పక్కా అంటున్నారు. ప్రజెంట్ శ్రీలీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది. చేతిలో పది సినిమాలకు పైగానే పెట్టుకుని హాట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే మారుమ్రోగిపోతూ ఉండటానికి కారణం ఆమె నటన అందమే అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news