Moviesఎన్టీఆర్ కి ఆ తెలుగు డైరెక్టర్ అంటే అంత కోపమా..? గత...

ఎన్టీఆర్ కి ఆ తెలుగు డైరెక్టర్ అంటే అంత కోపమా..? గత 12 ఏళ్ళ నుంచి నెంబర్ బ్లాక్..మాటల్ లేవ్.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఆ స్టార్ డైరెక్టర్ తో మాట్లాడడం లేదా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . జనరల్ గా తారక్ ఇండస్ట్రీలో చాలా జోవియల్ గా ఉండే హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు . అందరితో చాలా సరదా సరదాగా మాట్లాడుతుంటారు . అంతేకాదు అందరికీ సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే అంత మంచి మనసు గల తారక్ మాత్రం ఓ డైరెక్టర్ తో గత 12 సంవత్సరాలుగా మాట్లాడడం లేదు .

అంతే కాదు ఆయన నెంబర్ కూడా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను . బోయపాటి శ్రీను – తారక్ కాంబోలో వచ్చిన సినిమా దమ్ము. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంత హంగామా చేశారో మనకు తెలిసిందే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని బిగ్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించబోతుంది అంటూ బోయపాటి శ్రీను ఎక్కువగా సినిమాపై హైప్ పెంచేశారు .

సీన్ కట్ చేస్తే ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు . అంతేకాదు కధ చెప్పేటప్పుడు ఒకలా తెరకెక్కించేటప్పుడు మరొకల.. ఎడిటింగ్ లో మరొక ల బోయపాటి శ్రీను ఎన్టీఆర్ ని చీట్ చేశారట . ఆ కోపంతోనే తారక్ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఆయనతో మాట్లాడనే మాట్లాడడం లేదట . నెంబర్ కూడా బ్లాక్ చేసేసాడట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news