Moviesఅప్పుడే సుమ కొడుకు రోషన్ మల్టీ స్టార్ట్ మూవీ.. రెండో హీరో...

అప్పుడే సుమ కొడుకు రోషన్ మల్టీ స్టార్ట్ మూవీ.. రెండో హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మంచి ఎనర్జిటిక్ గా ముందుకు వెళ్ళిపోతున్నాడు . నిన్న కాక మొన్నే ఆయన నటించిన బబుల్గం సినిమా రిలీజ్ అయింది . బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు . ఏదో యువతకు మాత్రం బాగానే నచ్చేసింది. ఆ ముద్దులు ..హగ్గులు ..కొరకడాలు కుర్రాళ్లకు బాగానే కిక్ ఎక్కించేసింది . కలెక్షన్స్ పరంగా కూడా పెద్ద చెప్పుకోదగ్గ రేంజ్ లో లేవు .

అయినా సరే సుమ కొడుకు వెంటనే రెండో సినిమాకి సైన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అది కూడా మల్టీస్టారర్ మూవీ కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల తన రెండో సినిమాకి సైన్ చేశారట . అది కూడా మరో కొత్త డైరెక్టర్ తో .. అంతేకాదు ఈ సినిమా మల్టీ స్టార్టర్ గా తెరకెక్క బోతుందట.

ఈ సినిమాలో సెకండ్ హీరోగా సునీత కొడుకు చేస్తున్నారట. సునీత యాంకర్ సుమ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ఆకాష్ – రోషన్ కూడా అంతే మంచి ఫ్రెండ్స్ అని జనాలకు తెలియజేయబోతున్నారు సుమ – . సునీత సునీత కొడుకు ఆకాష్ కూడా సర్కారునౌకరి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమా కూడా పాజిటివ్ రిజల్ట్ అందుకుంది . ఈ క్రమంలోనే ఇద్దరు హీరోలు కలిసి స్నేహానికి సంబంధించిన సినిమాలో నటిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరు బాగా వైరల్ అవుతుంది అని ఫ్యూచర్లో వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి తోడ్పడుతుందని సుమ సునీత కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట .. చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news