Moviesఆ స్టార్ హీరోయిన్ మీద కోపంతోనే నాభి అందాలు మొత్తం చూపించిన...

ఆ స్టార్ హీరోయిన్ మీద కోపంతోనే నాభి అందాలు మొత్తం చూపించిన సౌంద‌ర్య‌..!

సౌంద‌ర్య పేరు చెపితేనే తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎన్నో మంచి సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అస‌లు 15 ఏళ్ల పాటు ఎంతోమంది హీరోయిన్లు వ‌చ్చినా కూడా సౌంద‌ర్య టాలీవుడ్‌ను సింగిల్‌గా ఏలేసింది. స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వ‌ర‌కు అంద‌రూ సౌంద‌ర్య‌తో న‌టించాల‌ని ఇంట్ర‌స్ట్‌తో ఉండేవారు. అస‌లు సౌంద‌ర్య త‌మ సినిమాలో ఉంటే ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్టే అని హీరోలు డిసైడ్ అయిపోయేవారు. స్టార్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా సౌంద‌ర్యే కావాల‌ని వారే.

అటు ర‌చ‌యిత‌లు కూడా సౌంద‌ర్య‌ను దృష్టిలో ఉంచుకునే హోమ్లీ పాత్ర‌లు రాసేవారు. సౌంద‌ర్య అంటే మ‌హిళా ప్రేక్ష‌కులు బాగా లైక్ చేసేవారు. ఎలాంటి గ్లామ‌ర్ రోల్స్‌, బోల్డ్ రోల్స్ చేయ‌కుండా హెమ్లీ పాత్ర‌ల‌తో అన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా ఉండ‌డం ఒక్క సౌంద‌ర్య‌కే చెల్లింది. అటు చిరు, నాగ్‌, వెంకీ లాంటి స్టార్ హీరోల నుంచి జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, రాజ‌శేఖ‌ర్‌, అబ్బాస్ లాంటి మిడ్ రేంజ్ హీరోల‌తో కూడా ఆమె ఒకే టైంలో న‌టించేది. ఆమె చ‌నిపోయి ఇన్నేళ్ల‌వుతున్నా కూడా సౌంద‌ర్య‌ను జ‌నాలు ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే ఆమె పోషించిన పాత్రలే నిద‌ర్శ‌నం.

అయితే కెరీర్ చివ‌ర్లో మాత్రం సౌంద‌ర్య కాస్త గ్లామ‌ర్‌కు గేట్లు ఎత్తేసింది. కెరీర్ కాస్త ఇబ్బందుల్లోకి వెళుతుందేమో అనుకున్న టైంలోనే సౌంద‌ర్య ఇలా గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. త‌న బొడ్డును యాపిల్‌లా చూపించ‌డంతో పాటు చీర‌చాటున త‌న అందాలు చూపించి.. చూపించ‌న‌ట్టుగా చూపిందేది. ఆ టైంలో సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీ ప‌క్క‌న వ‌రుస‌గా అవ‌కాశాలు కొట్టేయ‌డం మొద‌లు పెట్టింది.

ఆ టైంలో అన్ని అవ‌కాశాలు సిమ్రాన్‌కే వెళ్లేవి. అప్పుడు త‌న ప్రాభావం కాపాడుకునే క్ర‌మంలోనే సౌంద‌ర్య కాస్త అందాలు చూపించ‌డం మొద‌లు పెట్టేసింది. అన్నయ్య, జయం మనదేరా, చూడాలని ఉంది లాంటి సినిమాలలో సౌందర్య బొడ్డు చూస్తే క‌సెక్కిపోయేదని అప్ప‌టి కుర్ర‌కారు బాగా చ‌ర్చించుకునేవారు. ఏదేమైనా సిమ్రాన్ మీద కోపంతోనే సౌంద‌ర్య త‌న అందాలు బ‌య‌ట‌పెట్టేద‌ని కూడా టాలీవుడ్‌లో బాగా చ‌ర్చ జ‌రిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news