Moviesనాగ‌చైత‌న్య - అనుష్క పెళ్లి.. నాగార్జున ఆగ్ర‌హం.. తెర‌వెన‌క ఏం జ‌రిగింది..!

నాగ‌చైత‌న్య – అనుష్క పెళ్లి.. నాగార్జున ఆగ్ర‌హం.. తెర‌వెన‌క ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్‌లో 2005లో నాగార్జున హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు ముందు ఆమె యోగా టీచ‌ర్‌. నాగ‌చైత‌న్య‌కు యోగా నేర్పే క్ర‌మంలోనే ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఆమె ఉండేది. అక్క‌డే అనుష్క‌ను చూసిన పూరి ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేసి సూప‌ర్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఆ త‌ర్వాత ఆమె టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్ అయిపోయింది. నాగార్జున – అనుష్క కాంబినేష‌న్లో కూడా ఎన్నో హిట్ సినిమాలు వ‌చ్చాయి. అనుష్క – నాగార్జున కాంబినేషన్ అంటే చాలు తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టి ఆ సినిమాల‌ను హిట్ చేసేవారు. చాలాకాలం పాటు నాగార్జున‌తో క‌లిసే అనుష్క వ్యాపారాలు చేసింద‌ని.. నాగ్‌తో క‌లిసే అమ‌రావ‌తి, వైజాగ్‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవార‌ని ప్ర‌చారం ఉంది.

అయితే చివ‌ర్లో అనుష్క – నాగార్జున మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని.. అనుష్క‌ను అందుకే నాగార్జున దూరం పెట్టాడ‌ని టాలీవుడ్ గుస‌గుస‌. నాగార్జున – అనుష్క మ‌ధ్య సంథింగ్.. సంథింగ్ న‌డిచింద‌న్న ప్ర‌చార‌మూ ఉంది. అయితే ప‌దేళ్ల క్రితం నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌కు, అనుష్క‌కు మ‌ధ్య పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌న్న వార్త తెలుగు మీడియాను షేక్ చేసింది. పైగా ఇది మెయిన్ పేప‌ర్ ఆంధ్ర‌జ్యోతిలోనే రావ‌డంతో ఇది నిజ‌మేనా ? అన్న సందేహాలు కూడా క‌లిగాయి.

వీరి పెళ్లికి నాగార్జున గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని కూడా ప్ర‌చారం ఉంది. ఆ వెంట‌నే నాగార్జున దీనిని ఖండించి.. ఈ పెళ్లి వార్త అబద్ధం అని చెప్పారు. ఈ వార్త‌ల‌పై నాగార్జున తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా.. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ఖండ‌న కూడా ఇచ్చింది. అనంత‌రం చైతు.. మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లు కూడా కాపురం చేయ‌కుండానే వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news