Moviesదమ్ముంటే ఆ పని చేసి నిరూపించండి.. స్టార్ డైరెక్టర్స్ కు...

దమ్ముంటే ఆ పని చేసి నిరూపించండి.. స్టార్ డైరెక్టర్స్ కు ఫ్యాన్స్ ఓపెన్ సవాల్..!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే ప్రశాంత్ నీల్.. రాజమౌళి.. సుకుమార్ పేర్లే మారు మ్రోగిపోతున్నాయి . స్టార్ డైరెక్టర్లుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముగ్గురు తోపైన డైరెక్టర్లు . ఆ విషయంలో అస్సలు మాట్లాడడం సరికాదు . అయితే ఈ ముగ్గురికి సంబంధించిన ఒక న్యూస్ ని ఇప్పుడు జనాలు ట్రెండ్ చేస్తున్నారు. మనకి తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ముగ్గురు బడా డైరెక్టర్స్.

పెద్దపెద్ద హీరోలు కూడా వీళ్ళ డైరెక్షన్ లో నటించడానికి వెయిట్ చేస్తున్నారు . అయితే జనాలకు ఓ పెద్ద డౌటే వచ్చింది. ఆల్రెడీ పాపులారిటీ సంపాదించుకొని హిట్ కొట్టిన హీరోలతో సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టడం పెద్ద కష్టమైన పని కాదు. అసలు హిట్టే లేని ఒక హీరోని తీసుకొని వచ్చి నార్మల్ బడ్జెట్ పెట్టి ఆ హీరోతో సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొడితే అప్పుడు నిజమైన డైరెక్టర్ అని ఎవరైనా నమ్ముతారు.

అలాంటి సత్తా ఉంది మీలో అంటూ మేము కూడా నమ్ముతాము అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఫ్యాన్స్ కూడా నిజమేగా అంటూ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఇదే వార్త వైరల్ గా మారింది. వీళ్ల ముగ్గురు నెక్స్ట్ కమిట్ అయిన హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలే కావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news