Moviesచిరంజీవి "విశ్వంభర" కాన్సెప్ట్ టీజర్ ని చూశారా.. అచ్చం డిట్టో అంజీ...

చిరంజీవి “విశ్వంభర” కాన్సెప్ట్ టీజర్ ని చూశారా.. అచ్చం డిట్టో అంజీ 2 లానే ఉందిగా(వీడియో)..!!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా 156 . ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది . ఈ సినిమాను బింబిసారా డైరెక్టర్ విశిష్ట తెరకెక్కించబోతున్నాడు . కాగా నేడు సంక్రాంతి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేస్తూ కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకి “విశ్వంభర” అనే టైటిల్ ని ఖరారు చేశారు. గతంలో ఈ టైటిల్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయింది. అదే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడు వశిష్ట . అంతేకాదు టీజర్ లో చాలా అద్భుతంగా సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ను చూపించారు . చిన్న టీజర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకెంత రేంజ్ లో ఉండబోతుంది అంటూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది.

టీజర్ లో ఏదో ఒక ముఖ్యమైన వస్తువు వేరే యూనివర్స్ నుంచి భూమి మీదకి వచ్చినట్లు చూపిస్తారు . ఆ వస్తువు చుట్టూనే సినిమా కథంతా నడవబోతుంది అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. టైటిల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసేసాడు విశిష్ట . వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు . దీంతో ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ వైరల్ గా మారింది . అయితే కొంతమంది మాత్రం ఇది అచ్చం అంజి 2 లానే ఉంది అని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news