Moviesమెగాస్టార్ విశ్వంభ‌ర‌లో మ‌రో క్రేజీ హీరో...!

మెగాస్టార్ విశ్వంభ‌ర‌లో మ‌రో క్రేజీ హీరో…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు మ‌ల్లిడి వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభర సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ భారీ బ‌డ్జెట్ తో ఈ సోషియో ఫాంట‌సీ సినిమాను నిర్మిస్తోంది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో కాస్టింగ్, క్రూ విష‌యంలో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఓ త‌మిళ క్రేజీ హీరోను కూడా ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఆ హీరో ఎవ‌రో కాదు శింబు. శింబు కూడా చిరు సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. శింబుది నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. ద‌ర్శ‌కుడు ఈ పాత్ర‌ను చాలా ప‌వ‌ర్ ఫుల్గా డిజైన్ చేశాడ‌ని తెలుస్తోంది. శింబు గ‌త 20 ఏళ్ల నుంచి డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న హీరో. ఇటీవ‌ల శింబు సినిమాలు తెలుగులో పెద్ద‌గా రిలీజ్ కాక‌.. ఇక్క‌డ మ‌నోడి మార్కెట్ బాగా డౌన్ అయ్యింది.

ఇప్పుడు చిరు సినిమాలో న‌టిస్తే ఖ‌చ్చితంగా శింబు తెలుగు ప్ర‌జ‌ల‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు అన‌డంలో సందేహం లేదు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్టుకు త‌మిళంలో మంచి బ‌జ్ కూడా ఉంటుంది. ఏదేమైనా విశ్వంభ‌ర ప్రాజెక్టుపై రోజు రోజుకు అంచ‌నాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌కుండానే ఓవ‌ర్సీస్ డీల్ రు. 18 కోట్ల రేంజ్‌లో న‌డుస్తోందంటేనే సినిమాపై బ‌జ్ ఎలా ఉందో తెలుస్తోంది. ఈ భారీ సోషియో ఫాంట‌సీ సినిమాకు ఎంఎం. కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news