Moviesఆ డిజాస్ట‌ర్ హీరోయిన్‌ను బుట్ట‌లో ప‌డేసిన వేణుస్వామి... లైఫ్ మార్చేస్తాడా...!

ఆ డిజాస్ట‌ర్ హీరోయిన్‌ను బుట్ట‌లో ప‌డేసిన వేణుస్వామి… లైఫ్ మార్చేస్తాడా…!

తెలుగులో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సమంత‌, నాగ‌చైత‌న్య పెళ్లి జ‌ర‌గ‌క‌ముందే విడిపోతార‌ని చెప్పి సంచ‌ల‌నం రేపిన వేణుస్వామికి అది నిజం అయ్యాక మ‌రింత క్రేజ్ పెరిగింది. నిహారిక విడాకుల విష‌యంలోనూ ఆయ‌న చెప్పిందే జ‌రిగే స‌రికి అంద‌రికి వేణుస్వామి జాత‌కంపై బాగా గురి కుదురుతోంది.

అయితే ఇటీవ‌ల తెలంగాణ‌లో వ‌రుస‌గా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతాడంటూ ఆయ‌న చెప్పిన జాత‌కం మాత్రం పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. ఇక టాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు వేణుస్వామితో పూజ‌లు చేయించుకుంటున్నారు. రష్మిక, నిధి అగర్వాల్​తోపాటు మరికొందరు ఈ లిస్ట్​ ఉన్నారు. ఇక ఇప్పుడు తెలుగమ్మాయి.. బ్లాక్‌బ్యూటీ డింపుల్ హ‌య‌తి వంతు వ‌చ్చింది.

ఆమె ఇంట్లో కూడా వేణుస్వామి పూజలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ పూజల వీడియోను వేణుస్వామి తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేయ‌డంతో అవి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వేద‌మంత్రాల మ‌ధ్య వేణుస్వామి డింపుల్‌కు ఆశీర్వ‌చ‌నం అంద‌జేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

డింపుల్ కెరీర్ ఏ మాత్రం ఆశాజ‌నకంగా లేదు. ఆమెకు వ‌రుస‌గా ప్లాపులే ప‌ల‌క‌రిస్తున్న‌యి. మ‌రి వేణుస్వామి పూజ‌ల‌తో అయినా ఆమె జాత‌కం మారుతుందేమో ? చూడాలి. ఇక కొద్ది రోజుల క్రితం డింపుల్ కాంట్ర‌వ‌ర్సీగా వార్త‌ల్లోకెక్కింది. త‌న అపార్ట్‌మెంట్‌లో ఓ ఐపీఎస్ అధికారితో జ‌రిగిన వివాదంతో ఆమె వార్త‌ల్లోకెక్కింది. ఇక డింపుల్ విజ‌య‌వాడ‌కే చెందిన అమ్మాయి ఆమె గ‌ల్ఫ్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news