Movies"బబుల్ గమ్" లో రోషన్ కి తండ్రి గా నటించిన ఈయన...

“బబుల్ గమ్” లో రోషన్ కి తండ్రి గా నటించిన ఈయన .. మన తెలుగు యంగ్ హీరో బ్రదరే..!!

రోషన్ కనకాల తాజాగా నటించిన సినిమా బబుల్ గమ్. సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది యంగ్ హీరోస్ పుట్టుకొస్తున్నారు . నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఎంతోమంది వస్తున్నారు . అయితే ఒక యాంకర్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి యాంకర్ గా పాపులారిటి సంపాదించుకున్న సుమ కొడుకే ఈ రోషన్ కనకాల.

తండ్రి రాజీవ్ కనకాల కూడా మంచి నటుడు . రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమా డిసెంబర్ 29న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . పాజిటివ్ హిట్ అని చెప్పలేం కానీ ..కాని ఓకే యువతను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు . సినిమా మొత్తానికి ముద్దులు – హగ్గులు – కొరకడాలే కాబట్టి నేటి యువత బాగానే అట్రాక్ట్ అవుతుంది . సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి . అయితే ఇదే క్రమంలో ఈ సినిమాలో రోషన్ కి ఫాదర్ గా నటించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

స్క్రీన్ మీద ఆయనను చూడగానే చాలా చాలా విజిల్స్ పడ్డాయి . దానికి కారణం ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ బ్రదర్ కావడం . ఈ సినిమాలో రోషన్ తండ్రి యాదగిరి పాత్రలో నటించింది చైతూ జొన్నలగడ్డ . ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి . సిద్దు జొన్నలగడ్డ అన్న అయ్యేసరికి భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అనుకున్న విధంగానే బాగా నటించాడు . పక్క హైదరాబాదీ సాంగ్లో చైతు అదరగొట్టేసాడు .ముఖ్యంగా రోషన్ తో కనిపించిన ప్రతి సీన్స్ డైలాగ్స్ బాగా పండాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో చైతూ జొన్నలగడ్డ మరి ఎన్ని పాత్రలో నటించి మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news