Moviesబిగ్ షాకింగ్: సినీ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపులు..!!

బిగ్ షాకింగ్: సినీ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపులు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జయప్రద మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మాజీ ఎంపీ సినీనటి జయప్రద పై నాన్ బెయిలబలు అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమాళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్ట్ ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది .

ఈ కేసు అప్పటినుంచి విచారణ జరుగుతూనే ఉంది . అయితే జయప్రద మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. జడ్గీ చాలాసార్లు సీరియస్ అయినా సరే జయప్రద లైట్ గా తీసుకుంది. నవంబర్ 8న ఈ కేసు పై విచారణ జరగాల్సి ఉండగా జయప్రద కోర్టుకు హాజరు కాలేదు . ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారి మాట్లాడుతూ..” జయప్రద కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు”.

దీంతో సీరియస్గా తీసుకున్న న్యాయస్థానం ఎలాగైనా సరే ఆమెను జనవరి పదిలోగా కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . అయితే రాంపూర్ ఎస్పీ ఆమెని వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమె ఆచూకీ తెలియడం లేదు . ఆ బృందం కూడా జయప్రదని వెతకడానికి ..ఆచూకీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న కనిపెట్టలేక పోతుంది . దీంతో ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు..? అనే విషయాలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news