News"హాయ్ నాన్న" కధ ఆ స్టార్ హీరోదా..? ఏం ట్విస్ట్ ఇచ్చావు...

“హాయ్ నాన్న” కధ ఆ స్టార్ హీరోదా..? ఏం ట్విస్ట్ ఇచ్చావు రా డైరెక్టర్..!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నాని నటించిన హాయ్ నాన్న సినిమాకు సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది . మరీ ముఖ్యంగా నాని నటన ఈ సినిమాకి హైలైట్ గా ఉన్న తాను అనుకున్న కథను జనాలకు తెలియజేయడం విషయంలో డైరెక్టర్ శౌర్యవ్ బాగా దెబ్బతిన్నాడు అనే చెప్పాలి ,

సినిమా కథ విషయానికి వస్తే పాత చింతకాయ పచ్చడి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కధను పూర్తిగా మనం ఎన్నో సినిమాల్లో చూసిన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ లవ్ ఎమోషనల్ లాగానే కానీ అక్కడక్కడ కొన్ని మసాలాలు దట్టించి బాగానే తెరకెక్కించాడు డైరెక్టర్. సినిమా కథ మొత్తం చాలా స్లోగా పోతుంది . ఎక్కడ సస్పెన్స్.. నవ్వు.. అనేటివి ఏవి ఉండవు . సినిమా మొత్తానికి ఎమోషన్ రొమాన్స్ తప్పిస్తే మిగతా విషయాల గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా స్కోప్ లేదు .

సినిమాలో అందరికన్నా హైలెట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం మృణాల్. ఆ తర్వాత పాప అని చెప్పాలి. నాని నటన బాగున్నప్పటికీ అది అభిమానులను మెప్పించలేకపోయింది . ఈ సినిమా కథను మనం బాగా గమనిస్తే గతంలో నాగార్జున కెరీర్ లో తెరకెక్కి హిట్ అయిన సంతోషం సినిమా లానే ఉంది . దగ్గర దగ్గరగా అదే సీన్స్ ను మళ్ళీ తెరపై చూపించాడు శౌర్యవ్. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఇంచుమించు అదే విధంగా వచ్చేలా మనకి కనిపిస్తుంది ,

ఈ క్రమంలోనే డైరెక్టర్ అంత కష్టపడి నాగార్జున హిట్ మూవీ సంతోషాన్ని రీమేక్ చేసి నాని రూపంలో మనకి చూపించాడా..? అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు గతంలో ఈ విధంగా ట్రోలింగ్ జరిగిన పెద్దగా పట్టించుకోని నాని ఫాన్స్ … వన్స్ థియేటర్ కి వెళ్లి తెరపై ఆ సినిమాను చూడగానే ఇది సంతోషం సినిమాకి రీమిక్ రా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. నాని ఫాన్స్ అయితే ఈ సినిమాను చూడొచ్చు కానీ మిగతా ఫాన్స్ కు పెద్దగా నచ్చుతుంది అని చెప్పలేం అంటున్నారు జనాలు. దీంతో నాని హాయ్ నాన్న ఫస్ట్ డే కలెక్షన్స్ పై అందరికన్ను పడ్డింది. చూద్దాం ఏ విధంగా సాధిస్తాడు నాని కలెక్షన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news