Newsఆర్తి అగర్వాల్ ని అందరూ వాడుకున్నారు... ప‌చ్చి నిజాలు బ‌య‌ట‌పెట్టిన డైరెక్ట‌ర్‌...!

ఆర్తి అగర్వాల్ ని అందరూ వాడుకున్నారు… ప‌చ్చి నిజాలు బ‌య‌ట‌పెట్టిన డైరెక్ట‌ర్‌…!

అమ్మ రాజశేఖర్..ఈ పేరు వింటే అందరికీ విపరీతమైన మాస్ సాంగ్స్ గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, నితిన్, గోపీచంద్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ..ఇలా దాదాపు స్టార్స్ అందరికీ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. సినిమాలో మాస్ సాంగ్ ఉంటే అది ఖచ్చితంగా అమ్మ రాజశేఖర్ తోనే చేయించేవారు.

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ అదిరిపోయే మాస్ సాంగ్ అమ్మ రాజశేఖర్ తోనే కంపోజ్ చేయించేవారు. ఒకదశలో ఓపెనింగ్ సాంగ్ లారెన్స్ మాస్టర్ ఫారిన్ లో డ్యూయెట్ సాంగ్ అంటే రాజు సుందరం, క్లైమాక్స్ లో మాస్ సాంగ్ అంటే అమ్మ రాజశేఖర్. ఇలా ఉండేది ఆర్డర్. బన్నీ సినిమాలో అమ్మ రాజశేఖర్ వల్లే మొదట్లో ఉన్న సాంగ్ క్లైమాక్స్ లో పెట్టి సూపర్ హిట్ అయ్యేలా చేశారు.

డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత రణం సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తర్వాత టక్కరి, ఖతర్నాక్ లాంటి సినిమాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాలు డిజాస్టర్ సాధించాయి. దాంతో కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హీరోగా, దర్శకత్వంలో ఒక సినిమాను చేశారు.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ దాదాపు ఫేడవుట్ స్టేజ్ లో ఉంది. తను ఎలాంటి పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేసిందో చెప్పి ఏడ్చిందట. నన్ను అందరు వాడుకున్నారని, ఇప్పుడు దూరం పెట్టారని వాపోయిందట. ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ చాలా సపోర్ట్ చేసి నీకు మంచి లైఫ్ ఇస్తానని ధైర్యం చెప్పారట. కానీ, అనుకోకుండా ఆర్తి మృతి చెంది ఇప్పుడు జనాల మధ్య లేదు..ఇటీవల ఈ విషయాన్ని అమ్మ రాజశేఖర్ స్వయంగా వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news