Newsమరో 10 ఏళ్లలో జరగబోయేది అదే..ఎన్టీఆర్ జాతకంలో అలా ఉందా..?...

మరో 10 ఏళ్లలో జరగబోయేది అదే..ఎన్టీఆర్ జాతకంలో అలా ఉందా..? నందమూరి ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్ ఇది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను చేస్తున్న గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ అదోరకమైన గౌరవం . చిన్నవాళ్ళకు ప్రేమ.. పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడంలో మన ఎన్టీఆర్ తర్వాతే మరి ఏ హీరో అయినా .. ఫాన్స్ ను ఫ్యాన్స్ గా కాకుండా సొంత బ్రదర్స్ ల భావించే ఏకైక హీరో ఎన్టీఆర్ .అందుకే ప్రతి ఆడియో ఈవెంట్ లోను.. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సలహాలు ఇస్తూనే ఉంటారు. ” మీ ఇంటి దగ్గర మీ అమ్మానాన్నలు వెయిట్ చేస్తూ ఉంటారు ..దయచేసి ఎంత క్షేమంగా వచ్చారో.. అంతే క్షేమంగా వెళ్ళండి “అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. కాగా ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు .

ఆ తర్వాత దేవర 2 లో కూడా నటించబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా బడా సినిమాలలో భాగం అయిపోయిన తారక్ జాతకానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆయన తాతను మించిన రాజకీయ నాయకుడు అవుతాడట. ఇప్పటివరకు ఎన్టీఆర్ రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆయన జాతకంలో మాత్రం సీఎంగా మారుతారు అని ..జనాలకు సేవ చేస్తారు అని అదేవిధంగా తాతను మించిన రాజకీయ నాయకుడు అవుతాడు అని ఉందట.

అంతేకాదు మరో 10 ఏళ్లలో రాజకీయాలలో ఎవరు ఊహించని సంచలన మార్పులు రాబోతున్నాయి అంటున్నారు పండితులు . అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. వద్దు స్వామి నువ్వు సినిమాలే చేసుకో ఆ పాడు రాజకీయాలు మనకొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news