Newsఅయ్యయ్యో..ఆఖరికి "బేబి"కి ఎలాంటి పరిస్ధితి దాపురించిందే..మింగలేని కక్కలేని పోజీషన్ లో వైష్ణవి..ఏం...

అయ్యయ్యో..ఆఖరికి “బేబి”కి ఎలాంటి పరిస్ధితి దాపురించిందే..మింగలేని కక్కలేని పోజీషన్ లో వైష్ణవి..ఏం జరిగిందంటే..?

ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య తప్పు చేసిందా ..? అంటే అవును అంటున్నారు ఫ్యాన్స్. బుద్ధిగా తన పాటికి తాను యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో చేసుకుంటూ లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్న వైష్ణవి చైతన్య.. వెండి తెరపై మెరవాలి అన్న మోజుతో తన కెరియర్ని తానే నాశనం చేసుకుంటుంది అన్న వార్త వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన లేటెస్ట్ ఫస్ట్ సినిమా బేబీ.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు కలెక్ట్ చేసింది . ఈ సినిమారిలీజ్ అయిన కొత్తల్లో వైష్ణవి చైతన్య ను ఓ రేంజ్ లో పొగిడేసారు. అంతేకాదు ఆమె ఇండస్ట్రీని ఏలేస్తే హీరోయిన్ అవుతుంది అంటూ బడా బడా హీరోలు కూడా చెప్పుకొచ్చారు . సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు అమ్మడు ఒక్క పెద్ద సినిమాకి కూడా సైన్ చేయలేదు.

ఆనంద్ దేవరకొండ తోనే రెండో సినిమా సైన్ చేసింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేదు . ప్రభాస్ సినిమాలో ఆఫర్ బాలయ్య సినిమాలో ఆఫర్ ..అల్లు శిరీష్ సినిమాలో ఆఫర్ దక్కింది.. ఏకంగా పూరి జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఆఫర్ దక్కింది అంటూ వార్తలు మాత్రం వినిపించాయి . కానీ అఫీషియల్ ప్రకటనే లేదు .

అంతేకాదు కొందరు వైష్ణవి చైతన్య పేరుని మర్చిపోయారు. మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో ఆమె పై హ్యూజ్ హైప్ తీసుకొచ్చిన జనాలు సైతం వైష్ణవి చైతన్య బయట కనిపించిన పెద్దగా పట్టించుకోవడం లేదు . దీంతో ఆమె ఫాన్స్ కొందరు వైష్ణవి చైతన్య తప్పు చేసింది అని శుభ్రంగా తన పని తాను చేసుకుంటూ యూట్యూబ్లో ఉంటేనే మంచి పేరు వచ్చేదని .. ఇలా వెండితెరకు కమిట్ అయ్యి ఆమె పరువు ఆమె తీసుకొని అవకాశాలు లేక సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యే పరిస్థితి దాపురించింది అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news