Newsప్ర‌భాస్ - మారుతి సినిమా... ఈ కామెడీ చూశారా... అంతా రాడ్...

ప్ర‌భాస్ – మారుతి సినిమా… ఈ కామెడీ చూశారా… అంతా రాడ్ రంబోలాయే…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు ఇప్పుడున్న క్రేజీ లైన‌ప్‌లో అసలు మారుతితో సినిమా ఎందుకు ? తీస్తున్నాడో అర్థం కాక ప్రభాస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మారుతి చివరిసారిగా గోపీచంద్ తో తెర‌కెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చూసాం. మారుతి ఇప్పటివరకు తీసిన సినిమాలు చూసినా టాలీవుడ్ లోనే చెప్పుకోదగ్గ హిట్లు లేవు.

మారుతి రేంజ్ కు రు. 50 కోట్ల సినిమా అంటే చాలా గొప్ప.. అలాంటిది ప్రభాస్ ని పెట్టి ఏకంగా భారీ పాన్‌ ఇండియా సినిమా అంటే చాలామంది పెద్ద కామెడీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో పుకారు వార్త బయటకు వచ్చింది. అది కూడా పెద్ద కామెడీగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ రు. 300 కోట్లు అని.. ఇందులో ఒక్క వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ కోసమే ఏకంగా రు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

మారుతితో సినిమా అంటే రు. 50 కోట్లు ఎక్కువ.. అలాంటిది రు. 300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అంటే టాలీవుడ్ జనాలు ఇది పెద్ద కామెడీ వార్త అని.. పెద్ద అంబక్కు అని సెటైర్లు వేస్తున్నారు. ప్రభాస్ అనవసరంగా మారుతితో సినిమా ఒప్పుకుని పెద్ద రాంగ్ స్టెప్ చేశాడని.. అందులోను 300 కోట్ల భారీ బడ్జెట్ అంటే సినిమా ఆ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడం కూడా కష్టమే అని.. ఏ మాత్రం తేడా కొట్టిన మొత్తం అందరూ నిండా మునిగిపోతారన్న చర్చలు కూడా మొదలయ్యాయి.

ఇక ఇది ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ అని.. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్ కు.. అందులోనూ ముగ్గురు హీరోయిన్లు ఇలాంటి సినిమాకు రు. 300 కోట్లు బడ్జెట్ అంటే నిజంగా కామెడీ కాక ఇంకేం అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news