Moviesహైదరబాద్ లో ల్యాండ్ అయిన కొత్త జంట వరుణ్-లావణ్య..అప్పుడే మెగా టెక్...

హైదరబాద్ లో ల్యాండ్ అయిన కొత్త జంట వరుణ్-లావణ్య..అప్పుడే మెగా టెక్ చూపిస్తుందిగా(వీడియో)..!!

వచ్చేసారు ఎట్టకేలకు ఇటలీలో పెళ్లి చేసుకున్న కొత్తజంట వరుణ్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు . ఈ క్రమంలోనే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మీడియా వాళ్లకి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మనకు తెలిసిందే లాంగ్ టైం లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు . మూడు రోజుల పాటు వీళ్ళ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి .

మెగా హీరోలైన చిరంజీవి- రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ – సాయిధరమ్ తేజ్ – వైష్ణవ్ తేజ్ ఈ పెళ్లికి హాజరై పెళ్లికి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకే ఈ పెళ్లి టాక్ ఆఫ్ ద నేషన్ గా అయిపోయింది . కాగా మూడు రోజుల వెడ్డింగ్ డెస్టినీ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు కొత్తజంట వరుణ్ – లావణ్య . ఈ క్రమంలోనే నవ దంపతులను చూడగానే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియా వాళ్ళను చుట్టుముట్టింది .

లావణ్య వరుణ్ లను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. వరుణ్ తన టోటల్ లుక్ మార్చేయగా లావణ్య చాలా సింపుల్ లుక్స్ లో ఆకట్టుకునింది . చుడిదార్ లో లావణ్య చాలా చాలా సింపుల్ గా కనిపించింది . అయితే లావణ్య పెళ్లి జరిగి ఇంకా వారం రోజులు కూడా కాకముందే ఆమె నుదుట బొట్టు లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. అప్పుడే తాళిని బొట్టు దాచి పెట్టేసావా అంటూ కొందరు వ్యంగ్యంగా కౌంటర్ వేస్తుంటే ..మెగా ఫ్యామిలీలోకి వెళ్లాక ఆ టెక్ వచ్చేస్తుంది లే అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . అసలు లావణ్య ఎందుకు బొట్టు పెట్టుకోలేదు అనేది ఇప్పటికి అర్థం కావడం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news