Newsటాలీవుడ్ డైరెక్టర్లకు ఈ హీరోయిన్లు అంటే మహా పిచ్చి.. వీరి కాంబోలో...

టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ హీరోయిన్లు అంటే మహా పిచ్చి.. వీరి కాంబోలో సినిమా వస్తే హిట్ పక్కా!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయితే మళ్లీ మళ్లీ రిపీట్ అయి .. అదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకుంటుంటారు. వాళ్లలో కొందరే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ఈ స్టార్స్ ..!!

శేఖర్ కమ్ముల – సాయి పల్లవి: వీళ్ళిద్దరి కాంబో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు . వీళ్లిద్దరు కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమా ఫిదా. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన రెండో సినిమా లవ్ స్టోరీ . నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

సమంత – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు : వీళ్ళ కాంబో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అత్తారింటికి దారేది, అ ఆ ,సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి . వీళ్ళ కాంబో మళ్ళీ తెరపైకి రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాయల్ రాజ్ పుత్ – అజయ్ భూపతి : వీళ్ల కాంబోలో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . వీళ్ళ కాంబోలో ఫస్ట్ వచ్చిన సినిమా ఆర్ఎక్స్ 100 ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది . ఎటువంటి చరిత్ర సృష్టించిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా మంగళవారం . రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది . సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. ఇలా టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ హీరోయిన్లు భలే లక్కీగా కలిసి వచ్చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news