Newsచంద్ర మోహన్ కి కె.విశ్వనాథ్ ఏం అవుతాడో తెలుసా..? వాళ్లిద్దరు ఇంత...

చంద్ర మోహన్ కి కె.విశ్వనాథ్ ఏం అవుతాడో తెలుసా..? వాళ్లిద్దరు ఇంత దగ్గరి బంధువులా..?

టాలీవుడ్ సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి కంట్రోల్ తప్పడంతో ట్రీట్మెంట్ కి ఆయన బాడీ సహకరించక కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు . ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోలు ప్రముఖులు ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. అంతేకాదు ఆయనతో ఉన్న స్నేహబంధం గురించి సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు .

ఇలాంటి క్రమంలోనే చంద్రమోహన్ కి కే విశ్వనాథ తో ఉన్న విడదీయరాని అనుబంధం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కే విశ్వనాథ్ ఈ మధ్యకాలంలోనే మరణించారు . ఆయన మరణం కూడా అభిమానులకు తీవ్ర విషాదాని మిగిల్చింది. ఆయన మరణించిన టైంలో ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్ బోరను విలపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కే విశ్వనాథ్ ఆయనకు పెదనాన్న కొడుకు అవుతాడు అని చంద్రమోహన్ స్వయంగా మీడియా ముందు చెప్పారు .

“దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కే విశ్వనాథ్ కు ఒక కజిన్ అయితే తాను మరో కజిన్ ని అంటూ చెప్పి చంద్రమోహన్ విలపించారు”. సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ పరంగా బాంధవ్యం ఎక్కువగా ఉండేది అని అందరికంటే నేను ఆయనకు చాలా చాలా దగ్గర వాడినని .. మేము పలుచోట్ల కూడా ఒకే దగ్గర స్థలం కొనుక్కున్నామని.. పక్కపక్కనే ఇల్లులు కట్టుకున్నామని .. 25 సంవత్సరాలు పక్కపక్కనే ఉన్నామని అలాంటి విడదీయరాన్ని అనుబంధం మాది అని చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఆయన నటుడిగా ఎదగడానికి కే విశ్వనాథ్ గారి సినిమాలే కారణమంటూ కూడా చెప్పుకొచ్చారు”. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధుత్వం కి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news