Moviesబాహుబలి సినిమాకి ప్రభాస్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.. జక్కన్న ఏం...

బాహుబలి సినిమాకి ప్రభాస్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.. జక్కన్న ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అన్న పేరు వినగానే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు అందుకుంటున్నాడు .. అంటే ఆయన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఇలాంటి క్రమంలోనే బాహుబలి సినిమాకి ప్రభాస్ పెట్టిన క్రేజీ కండిషన్ నెట్టింట లీకై వైరల్ గా మారింది .

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి పని పిచ్చి వాడు అనే సంగతి మనందరికీ తెలిసిందే . తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని వాదించే టైప్ . ప్రభాస్ ఏమో మంచి ఫుడీ.. కడుపునిండా తిన్నామా..? అనుకునే టైపు.. అయితే రాజమౌళి బాహుబలి సినిమాకు ఓ సపరేట్ డైటీషియన్ పెట్టి డైట్ ఫాలో చేయమన్నారట .

మన ప్రభాస్ ఏమో ముక్కలేనిది ముద్ద దిగే టైప్ కాదు .. జక్కన్న ఏమో ప్యూర్ వెజిటేరియన్ డైటీషియన్ ని తీసుకొచ్చాడు . దీంతో ప్రభాస్ నేను బాహుబలి పార్ట్ 2 చేయాలి అంటే కచ్చితంగా నా కండిషన్ను ఒప్పుకోవాలి.. నీ సినిమా షూట్ చేసే టైంలో మాత్రమే డైట్ ఫాలో అవుతాను.. మిగతా టైం లో నాకు నచ్చిన ఫుడ్ తినేస్తాను జక్కన్న ప్లీజ్ జక్కన్న అంటూ రిక్వెస్టింగ్ కం ఆర్డర్ చేశారట. దీంతో జక్కన్న సైతం ప్రభాస్ పొజిషన్ అర్థం చేసుకొని కండిషన్ ను యాక్సెప్ట్ చేశాడు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభాస్ కోరిక నెరవేరింది ..జక్కన్న ఆశ తీరింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news