News' అన్‌స్టాప‌బుల్ 3 ' ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్టు ఎవ‌రంటే... బాల‌య్య...

‘ అన్‌స్టాప‌బుల్ 3 ‘ ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్టు ఎవ‌రంటే… బాల‌య్య మోత మోగిస్తాడు…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ప్రచార చిత్రాలు.. తాజాగా వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై అంచనాల మామూలుగా లేవు. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తుండగా.. శ్రీలీలా బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన టైర్ ట్రైలర్ చాలా సరికొత్తగా కనిపిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటు సినిమాలు చకచక పూర్తి చేస్తున్న బాలయ్య బుల్లితెరపై ఆహా ఓటీటీ షోలో తాను చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 3 కి కూడా రెడీ అవుతున్నాడు.

ఆహాలో వచ్చిన అన్‌స్టాప‌బుల్ రెండు సీజన్లలో తన అద్భుత హోస్టింగ్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య త్వరలోనే సీజన్ 3 ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అన్‌స్టాప‌బుల్ మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి బ్లాక్ బస్టర్ అప్డేట్ వచ్చేసింది. దసరా నుంచి లాంఛ్‌ కానున్న ఈ మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి భగవత్ కేసరి టీం స్పెషల్ గా రానున్నట్టు తెలుస్తోంది.

ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ సినిమా టీం చేసే సందడి అదిరిపోనుందని అంటున్నారు. మొత్తంగా సీజన్ 3 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా.. గత రెండు సీజన్లనే మించేలా ఆహా వాళ్ళు దీన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అనుస్టాప‌బుల్ 3 గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news