Newsసింగ‌ర్ సునీత ఫ‌స్ట్ భ‌ర్త‌తో విడిపోవ‌డం వెన‌క అంత జ‌రిగిందా..!

సింగ‌ర్ సునీత ఫ‌స్ట్ భ‌ర్త‌తో విడిపోవ‌డం వెన‌క అంత జ‌రిగిందా..!

తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉంటుందో సునీత‌కు అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అందులోనూ సునీత పాటలు అంటే తెలుగు సినీ జనాలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు చెవి కోసుకుంటారు. అంత ఇష్టం సునీత పాటలు.. సునీత గాత్రం అంటే..! ఇప్పటివరకు వేలపాటలు పాడి సునీత మంచి గుర్తింపు తెచ్చారు సునీత.

సునీత వ్యక్తిగతం విషయానికి వస్తే రెండున్నర సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సునీత వయసు 40 + ప్లస్ లో ఉంది. ఈ టైంలో రెండో పెళ్లి ఏంటని ఎన్ని ? విమర్శలు వచ్చినా ఆమె ఏమాత్రం లెక్కచేయలేదు. రామ్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె తన జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకుంది.

అటు రామ్‌కు.. ఇటు సునీతకు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. అయితే సునీత మొదటి భర్త పేరు కిరణ్. అతడిని ప్రేమ వివాహం చేసుకున్న సునీత అసలు ఎందుకు ? విడిపోయింది అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. సునీత కేవలం 18 – 19 సంవత్సరాల వయసులోనే కిరణ్‌తో ప్రేమలో పడి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు మొదలయ్యాయి. స‌హ‌నం న‌శింకాచ భ‌ర్త టార్చ‌ర్ భ‌రించ‌లేక విడాకులు ఇచ్చేసింది.

భర్తకు దూరమయ్యాక దాదాపు 15 ఏళ్ల పాటు ఆమె ఒంటరిగా ఉంటూ వస్తుంది. ఈ టైంలో రామ్తో పరిచయం ఏర్పడటం ముందుగా సునీత అతడికి ప్రపోజ్ చేయడం.. ఆ తర్వాత రామ్ కూడా ఓకే చెప్పటంతో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే అంతకుముందే రామ్‌కు మరో అమ్మాయితో పెళ్లి అవటం.. మనస్పర్ధలు నేపథ్యంలో అతడు కూడా తన భార్యకు విడాకులు ఇవ్వడం జరిగాయి. ప్రస్తుతం రామ్ తో కలిసి సెకండ్ లైఫ్ ఎంతో సంతోషంగా గ‌డుపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news