Movies"భగవంత్ కేసరి"లో విజ్జి పాత్ర మిస్ చేసుకున్న ఆ దురదృష్టవంతురాలు ఈమె..దరిద్రం...

“భగవంత్ కేసరి”లో విజ్జి పాత్ర మిస్ చేసుకున్న ఆ దురదృష్టవంతురాలు ఈమె..దరిద్రం అంటే ఇదే..!!

ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో నటించడం అభిమానులకు సైతం చాలా ఇంట్రెస్టింగ్ హైప్ క్రియేట్ చేసింది . మొత్తానికి భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ స్వీప్ చేసేసింది .

అంతేకాదు సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. స్టార్టింగ్ నుంచి సినిమా పూర్తి అయ్యేవరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాకి బాలయ్య డైలాగ్స్ ఎంత ప్లస్ అయ్యాయో తన ఎమోషన్స్ తో అంతే ప్లస్ గా మారింది శ్రీలీల . విజ్జి పాత్రకు శ్రీలీల తప్పితే మరి ఎవరు సెట్ అవ్వరు అన్న రేంజ్ లో నటించింది .

నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కృతి శెట్టిని అప్రోచ్ అయ్యారట అనిల్ రావిపూడి . అయితే కూతురు పాత్ర అంటూ సాగదీసి చేయను అంటూ హ్యాండ్ ఇచ్చిందట . ఆ తర్వాత శ్రీ లీల ను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారు మేకర్స్ . మొత్తానికి శ్రీ లీల శభాష్ అనిపించుకునింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news