Movies"ఎప్పుడు ఇంత ఎనర్జటిక్ గా ఎలా ఉంటారు..?".. మాస్ ఆన్సర్ ఇచ్చిన...

“ఎప్పుడు ఇంత ఎనర్జటిక్ గా ఎలా ఉంటారు..?”.. మాస్ ఆన్సర్ ఇచ్చిన రవితేజ.. రియల్ హీరో నువ్వే బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మాస్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ . మాస్ మహారాజా గా ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకొని మరి హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న రవితేజ తాజాగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైం తన కెరియర్ లో పాన్ ఇండియా మూవీ చేశాడు.

కాగా ఈ సినిమా కోసం రవితేజ చాలా చాలా కష్టపడ్డాడు . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అభిమానులతో ఫేస్ టు ఫేస్ చాట్ చేశాడు రవితేజ . దీంతో రవితేజ ఫాన్స్ ఆయనను అడగాల్సిన ప్రశ్నలన్ని అడిగేసారు . రవితేజ సైతం దానికి తగ్గ రేంజ్ లోని అన్సర్ ఇచ్చాడు. ” ఓ అభిమాని వచ్చి మీరు ఎప్పుడు ఇంత ఎనర్జీగా ఎలా ఉంటారు సార్ ..?” అని అడగ్గా “నేను పాజిటివ్ .. పాజిటివ్గా ఆలోచిస్తాను .. పాజిటివ్ మైండ్ తోనే ఉంటాను .. అందుకే నేను ఎప్పుడూ ఇంత ఎనర్జిటిక్ గా ఉంటాను” అని మాస్ మహారాజా రేంజ్ లో రిప్లై ఇచ్చాడు.

అంతేకాదు ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు చేయాలి అని మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా..? అంటే ..నేను ఫ్యూచర్ గురించి ఆలోచించను .. బాధపడను. ఇప్పుడు ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను అనేది ముఖ్యమంటూ.. తనలోని మాస్ హీరోని బయటపెట్టేసాడు రవితేజ . అంతే కాదు మీరు షాక్ లాంటి ఎమోషనల్ సినిమాలో నటిస్తారా..? ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా..?…. అంటే చూద్దాం ఏం జరుగుతుందో..? అంటూ సైలెంట్ గా తప్పించుకున్నాడు .

అంతేకాదు టైగర్ నాగేశ్వరరావు మీ కెరియర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది అనగా ..పాన్ ఇండియా ఫిలిం కాదు ఇండియన్ ఫిలిం అనండి చాలు అంటూ కూసింత గట్టిగానే కౌంటర్ వేశాడు. మీ అభిమాన నటి ఎవరు అని అడిగితే.. ఆడవాళ్లంతా నా ఫేవరెట్ అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి అభిమానులను తెగ ఆకట్టుకున్నాడు రవితేజ . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news