Newsసినిమాల‌కు శ్రీలీల గుడ్ బై... ఫ్యాన్స్‌కు గుండెలు ముక్క‌లుచేసిందిరా...!

సినిమాల‌కు శ్రీలీల గుడ్ బై… ఫ్యాన్స్‌కు గుండెలు ముక్క‌లుచేసిందిరా…!

టాలీవుడ్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ శ్రీలీల‌. జాగా బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీలీల వచ్చే నెలలో మెగా హీరో వైష్ణవ తేజ్ ఆది కేశవ్ – డిసెంబర్లో నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ – సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి.

వ‌చ్చే యేడాది ఆమె న‌టించిన ఏడెనిమిది సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. శ్రీలీల ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే శ్రీలీల‌ సడన్గా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా 20 రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది. శ్రీలీల నిజంగా సినిమాలు మానేస్తే లక్షలాది మంది శ్రీలీల అభిమానులు హృదయాలు నిజంగానే పగిలిపోతాయి.

శ్రీలీల‌ ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబర్లో సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి. అందుకోసమే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 20 రోజులు పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనుంది. మహేష్ బాబుతో ఆమె నటిస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనుంది. పరీక్షలు తర్వాత ఆమె డేట్లు ఇచ్చిన మిగిలిన సినిమాల షూటింగ్లో కంటిన్యూగా పాల్గొంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్కో సినిమాకు శ్రీలీల మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీలీలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news