Movies"ప్రభాస్ బర్త డేకి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వదు".. మేకర్స్ కి...

“ప్రభాస్ బర్త డేకి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వదు”.. మేకర్స్ కి కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చింది ఆయనే..!

వామ్మో ..ఇది నిజంగా రెబెల్ ఫాన్స్ కు మెంటల్ ఎక్కించే న్యూస్ అనే చెప్పాలి. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు తన 44వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ రెబల్ హీరో . అయితే సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు అయినా ఆయనకు సంబంధించిన స్పెషల్ డే అయిన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్ . అయితే ప్రభాస్ పుట్టిన రోజు అయినా సరే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఒక్క సినిమా నుంచి కూడా అప్డేట్ రిలీజ్ కాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సాయంత్రం వరకు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసారు సర్ప్రైజ్ గా ఏదైనా అప్డేట్ వస్తుందేమో ..ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారేమో.. ట్రైలర్ అప్డేట్ ఇస్తారేమో ..అంటూ పడి కాపులు కాసారు .

అయితే మేకర్స్ ఒక్కటంటే ఒక్క చిన్న క్లూ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం పోస్టర్స్ కూడా రిలీజ్ చేయలేదు. కన్నప్ప సినిమా టీం ఆయనకు విష్ చేసింది తప్పిస్తే మరి ఎవరు ఆయనను పట్టించుకోలేదు . అయితే ప్రభాస్ ఫాన్స్ ఒళ్ళు మండిపోయింది. అందుకే ఘాటుగా మేకర్స్ ను తిడుతూ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

నిజానికి మేకర్స్ ప్రభాస్ బర్తడే నాడు పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేయాలనుకున్నారట. కానీ ప్రభాసే అందరికీ కాల్ చేసి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వద్దు అంటూ రిక్వెస్ట్ చేశారట . మొదటి నుంచి ఇలాంటివి పెద్దగా ఇష్టం లేని ప్రభాస్ తన బర్త్డ డే ను చాలా కూల్ గా సింపుల్ వే లోనే వెళ్లేలా చూసుకున్నాడట . తన బర్త్డ డే తన పర్సనల్ గానే ఫీలైన ప్రభాస్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వద్దు దయచేసి అంటూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేశారట . ఆ కారణంగానే ప్రభాస్ బర్త డే కు ఒక్క అప్డేట్ కూడా రివీల్ చేయలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news