News' భ‌గ‌వంత్ కేస‌రి ' ట్రైల‌ర్‌పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌... డేట్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ట్రైల‌ర్‌పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… డేట్ & టైం ఇదే..!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత బాల‌య్య హ్యాట్రిక్ కొడ‌తాడ‌న్న భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా, శ్రీలీల బాల‌య్య కూతురు పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భ‌గ‌వంత్ కేస‌రి నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని అంద‌రూ ఒక్క‌టే ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

ట్రైల‌ర్‌పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. భ‌గ‌వంత్ కేస‌రి ట్రైల‌ర్‌ను అక్టోబ‌ర్ 8న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఆ రోజు సాయంత్రం ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఈ రోజు రిలీజ్ చేసిన స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. పోస్ట‌ర్‌లో అయితే బాల‌య్య చాలా సింపుల్‌గా, చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు.

అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబినేష‌న్లో వ‌స్తోన్న తొలి సినిమా కావ‌డంతో ట్రేడ్‌తో పాటు టాలీవుడ్ అంతా ఎగ్జైటింగ్‌గా వెయిటింగ్‌లో ఉంది. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news