News`స‌లార్‌` రిజ‌ల్డ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్‌... సినిమా హిట్టా.....

`స‌లార్‌` రిజ‌ల్డ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్‌… సినిమా హిట్టా.. ఫ‌ట్టా..?

ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అడ‌గ‌క‌పోయినా స‌రే సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల జాత‌కాలు చెబుతూ వేణు స్వామి పాపుల‌ర్ అయ్యారు. మొద‌ట ఈయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. కానీ, ఎప్పుడైతే నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకులు తీసుకున్నారో.. అప్ప‌టి నుంచి వేణు స్వామిని కొంద‌రు న‌మ్మ‌డం ప్రారంభించారు. ఎందుకంటే నాగచైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు.

నిజంగా వారు నాలుగేళ్లు తిర‌క్కుండా డివోర్స్ తీసుకుని విడిపోయారు. ఆ త‌ర్వాత యాదృచ్ఛికంగా వేణు స్వామి చెప్పిన చాలా విష‌యాలు నిజం అయ్యాయి. దాంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది. ర‌ష్మిక‌, నిధి అగ‌ర్వాల్‌, డింపుల్ హ‌యాతి వంటి హీరోయిన్లు వేణు స్వామిని ఇంటికి పిలిపించుకుని ప్ర‌త్యేకంగా పూజాలు కూడా చేయించుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు కోట్లాది మంది ప్రభాస్ అభిమానులు మ‌రియు సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సలార్ మూవీపై వేణు స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌భాస్ ప్రతి సినిమాకు ముందు వేణుస్వామి రంగంలోకి దిగుతుంటారు. సినిమా ఫ‌లితం ఏంటో చెబుతుంటారు. రాధేశ్యామ్ ఫ్లాప్ అని చెప్పారు.. నిజంగానే ఆ సినిమా ప‌రాజ‌యం పాలైంది. అలాగే ఆదిపురుష్ ఎటువంటి సంచల‌నాలు నమోదు చేయదని, హిట్ అయ్యే అవకాశమే లేదని విడుద‌ల‌కు రెండు వారాల ముందే చెప్పారు. అదీ జ‌రిగింది. అంతేకాదు, ప్రభాస్ కు ఈ ఏడాది చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని.. సినిమాల పరంగా కూడా ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటారని చెప్పారు.

నిజంగానే ప్ర‌భాస్ కొంత కాలం నుంచి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌లె మోకాళ్ల‌కు సంబంధించిన స‌ర్జరీ కూడా చేయించుకున్నాడు. ఇక‌పోతే త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ నుంచి స‌లార్ మూవీ రాబోతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రాబోతోంది. సలార్ పార్ట్ 1ను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

అయితే సలార్ చిత్రం కూడా భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళ్తే నిరాశ చెందే ప్రమాదం ఉందని.. అనుకున్న రేంజ్ లో ఈ సినిమా విజయం సాధించే అవ‌కాశం లేద‌ని వేణు స్వామి చెప్పిన‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో అల‌జ‌డి మొద‌లైంది. మ‌రి వేణు స్వామి చెప్పిన‌ట్లు స‌లార్ ఫ‌ట్ అవుతుందో.. లేక హిట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news