Moviesపవన్ కళ్యాణ్- సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ సినిమా.....

పవన్ కళ్యాణ్- సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ సినిమా.. అబ్బా భ‌లే కాంబినేష‌న్ మిస్‌..!

సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు చూడటానికి చాలా బాగున్నా.. ప్రాక్టికల్ గా అవి ఎంత ట్రై చేసినా వర్కౌట్ కావు. కొన్ని కాంబినేషన్ లు మాత్రం చేతుల దాకా వచ్చి చేజారి పోతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దివంగత హీరోయిన్ సౌందర్య కాంబినేషన్ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత గోకులంలో సీత సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టారు.

ఈ క్రమంలోనే పవన్ నటించిన మూడో సినిమా సుస్వాగతం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసేలా ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ దేవయాని నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్గా సౌందర్య‌ని తీసుకోవాలనుకున్నారు. అయితే పవన్ ఒప్పుకోలేదట.

అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు. ఆమె నటన ముందు నా నటన సరిపోదు.. ఆమె బదులు వేరే హీరోయిన్ ను తీసుకోమని దర్శక నిర్మాతలను కోరారట. అప్పటికే సౌందర్య ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి సమయంలో స్వయంగా పవన్.. సౌందర్య తన సినిమాలో వద్దని చెప్పడంతో చేసేదేమీ లేక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దేవయానిని తీసుకుని సుస్వాగతం సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా ఆ రోజుల్లోనే ఫుల్ రన్ లో ఏకంగా రూ.6 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అలా పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబినేషన్లో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయిపోయింది. నిజంగా ఈ సినిమా వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్, సౌందర్య కెరీర్ లోనే ఎప్పటికీ మర్చిపోలేని హిట్ సినిమాగా నిలిచిపోయి ఉండేదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news