News' భ‌గ‌వంత్ కేస‌రి ' ని టార్గెట్ చేస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ని టార్గెట్ చేస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌… తెర‌వెన‌క ఏం జ‌రుగుతోంది..!

బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ అయిన ఉయ్యాలో ఉయ్యాల‌ పాటకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని చిత్రాలు, టీజర్లు, టైటిల్.. పోస్టర్లు బాలయ్య చెప్పిన అన్ని డైలాగులు అదిరిపోయాయి వీటన్నిటితో పోల్చి చూస్తే ఉయ్యాల ఉయ్యాల సాంగ్ కాస్త డల్ అని చెప్పాలి. అయితే ఈ సాంగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్సులు ఉండడంతో మెల్లమెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఓవైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు – తమిళ హీరో విజయ్ లోకేష్ కనగ‌రాజు కాంబినేషన్లో వస్తున్న లియో సినిమాలు పోటీ ఉన్నా కూడా భగవంత్‌ కేసరి విషయంలో ఎవరు వెనక్కి తగ్గటం లేదు. అయితే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు నందమూరి ఫ్యామిలీలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ చేసే వాతావరణం అయితే లేదు. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య కూడా చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పై మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ చేశారు.

అఖండ సినిమా టైంలో టాలీవుడ్ లోని అందరూ హీరోలు వారి అభిమానులు కూడా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అఖండకు గట్టిగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ అభిమానుల నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. అయితే ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు పూర్తిగా మారిపోవడం.. చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ అసలు స్పందించకపోవడం.. పైగా ఇటీవల ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్లికి చంద్రబాబును, టిడిపిని తీవ్రంగా విమర్శించే వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని రావడం ఇవన్నీ తెలుగుదేశం, బాలయ్య అభిమానులను బాగా హార్ట్ చేశాయి.

దీనికి తోడు నిన్న బాలయ్య కూడా ఎన్టీఆర్ రాకపోయినా ఐ డోంట్ కేర్ అనడంతో ఇప్పటికే ఉన్న‌ గ్యాప్ మరింత పెరిగినట్టుగా అనిపిస్తోంది. దీనిపై సోష‌ల్‌ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది. భగవంత్‌ కేసరి సినిమాకి ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ లేకపోతే కొంత ఇబ్బంది తప్పదని అంటున్నా ఇక్కడే మరో టాపిక్ కూడా వినిపిస్తోంది. వీరసింహారెడ్డి సినిమాకే ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని.. పైగా చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌ సినిమాకు పోటీగా వచ్చి తొలి రోజు ఏకంగా రు. 54 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది అని.. సినిమాలో దమ్ముంటే ఎవరి సపోర్టు ఉన్న లేకపోయినా ప్రేక్షకులు సినిమాను సూపర్ హిట్ చేస్తారంటున్నారు.

పైగా ఇప్పుడు బాలయ్య ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే భగవంత్‌ కేసరి సినిమాకు ఒక మోస్త‌రు టాక్ వచ్చినా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ చేసేలా రికార్డులు క్రియేట్ చేస్తుందని బాలయ్య అభిమానులు ధీమాతో ఉన్నారు. పైగా బాలయ్యకు ఇప్పుడు అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై ఎలాంటి క్రేజీ ఉందో చూస్తూనే ఉన్నాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news