Newsమ‌హేష్ హ్యాండ్ ప‌డ‌గానే మీనాక్షి చౌద‌రి రెమ్యున‌రేష‌న్ మారిపోయింది... కొత్త రేటు...

మ‌హేష్ హ్యాండ్ ప‌డ‌గానే మీనాక్షి చౌద‌రి రెమ్యున‌రేష‌న్ మారిపోయింది… కొత్త రేటు ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మీనాక్షి చౌదరి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అంతకుముందు మీనాక్షి చౌదరికి పేరున్న సినిమా ఒక్కటీ లేదు. ఎప్పుడు అయితే మహేష్ పక్కన నటిస్తుందో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు అవడంతో ఆమెకు పెద్ద షాకులు తగిలినట్టు అయింది.

హిట్ 2 సినిమాతో మీనాక్షి చౌదరికి సక్సెస్ దక్కిన ఆ సినిమా భారీ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు మీనాక్షి చౌదరి చేతిలో ఉన్నాయి. మీనాక్షి లేటెస్ట్ రెమ్యూనరేషన్ కోటిన్నర రూపాయలకు అటు ఇటుగా ఉందని తెలుస్తోంది. ఎప్పుడు అయితే మహేష్ హ్యాండ్ పడిందో ఆ తర్వాత ఆమె రేంజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయాయని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఇప్పుడు మీనాక్షి కోటిన్నరకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది.

అందం, అభినయం, హైట్ ఈ హీరోయిన్ సక్సెస్లో కీలకపాత్ర పోషించాయని సమాచారం. ఒకప్పుడు చిన్న చిన్న సినిమాలు మాత్రమే చేసుకునే మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు పక్కన నటించే రేంజ్ కు ఎదగటం వెనక అందంతో పాటు ఆమె హైట్ అని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి జోడిగా నటిస్తోంది. వచ్చే ఏడాది నాటికి మీనాక్షి చౌదరి కెరీర్ పరంగా మరింత ఎదగటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నడించటానికి అయినా తన సిద్ధంగా ఉన్నానని ఆమె హింట్ ఇస్తుంది. ఐఏఎస్ కావాలని తన లక్ష్యమని.. రియల్ లైఫ్ లో ఐఏఎస్ కాలేను.. కనీసం రీల్ లైఫ్ లో అయినా ఐఏఎస్ కావాలని ఉందని ఆమె చెబుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news