News' లియో ' వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌... విజ‌య్ - లోకేష్‌కు...

‘ లియో ‘ వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌… విజ‌య్ – లోకేష్‌కు బిగ్ టార్గెట్టే…!

ఇళ‌య దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లియో. భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దసరా కానుకగా ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో అయితే బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో పోటీపడుతూ లియో థియేటర్లలోకి దిగుతుంది. ఈ సినిమాలో విజయ్ హీరో కావ‌డం ఒక ఎత్తు అయితే.. లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకుడు కావడంతో తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగానే లియో కథ కూడా ఉండబోతోంది. మాస్టర్ మూవీ తర్వాత లోకేష్ – విజయ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. త్రిష హీరోయిన్ కాగా ప్రియా ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. సంజయ్ దత్ – సీనియ‌ర్ న‌టుడు అర్జున్ విలన్లుగా నటించారు. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుని యు / ఏ సర్టిఫికెట్ పొందింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ధియేటర్ – నాన్ ధియేటర్ బిజినెస్ కంప్లీట్ అయింది.

విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తమిళనాడులో ఈ సినిమా రు. 100 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో అన్ని భాషల హక్కులకు రు. 65 కోట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రు. 22 కోట్లకు సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. తెలుగులో విజయ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ డీల్. కేరళ హక్కులు 16 కోట్లకు.. కర్ణాటక హక్కుల 15 కోట్లకు.. రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదికోట్లకు లియో డీల్స్ సెటిల్ అయ్యాయి.

ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రు. 228 కోట్ల బిజినెస్ సినిమాపై జరిగింది. రు. 230 కోట్ల షేర్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుంది. విజయ్ మార్కెట్ లెక్కలతో పాటు గత చిత్రాల సక్సెస్ ట్రాక్ చూసుకుంటే మొదటి వారం రోజుల్లోనే ఈ కలెక్షన్లను ఈజీగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం కోలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేస్తుందని కూడా లెక్కలు వేస్తున్నాయి. ఈ ఏడాది కోలీవుడ్లో జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి రు. 600 కోట్లు కలెక్ట్ చేసింది మరి ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news