Newsహీరో విక్టరీ వెంకటేష్ వరల్డ్ కప్ ప్రిడిక్షన్.. ఫైనల్‌లో తలపడే రెండు...

హీరో విక్టరీ వెంకటేష్ వరల్డ్ కప్ ప్రిడిక్షన్.. ఫైనల్‌లో తలపడే రెండు జట్లు ఇవే..!

ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఆసక్తితో కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రపంచకప్‌లో ఎవరు ఊహించిన ఫలితాలు కూడా వస్తున్నాయి. పటిష్టమైన దక్షిణాఫ్రికాను, పసికూన నెదర్లాండ్స్ కంగు తినిపించింది. ఇక ఆఫ్గనిస్తాన్ ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్తాన్‌కు కూడా అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఇలా చిన్న చిన్న జట్లు కూడా పెద్ద జ‌ట్లను చిత్తుగా ఓడిస్తున్నాయి.

భారత జట్టు ఆరు వ‌రుస‌ అప్రతిహత విజయాలతో సెమీస్‌కు చేరువయ్యింది. ప్రస్తుతం ప్రపంచ సెమీస్‌కు చేరే టాప్ ఫోర్ జట్లు ఏవి అంటే ఇండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏవైనా సంచలనాలు నమోదు అయితే త‌ప్పా ఈ నాలుగు జ‌ట్లు కచ్చితంగా సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ క్రికెట్‌కు ఎంత వీరాభిమాని అన్న‌ సంగ‌తి తెలిసిందే. భారత జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా అక్కడికి వెళ్లి వెంకటేష్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత రాత్రి లక్నోలో జరిగిన భారత ఇంగ్లాండ్ మ్యాచ్‌కు హాజరైన వెంకటేష్ కాసేపు తెలుగు కామెంట్రీలో సందడి చేశారు. తన అంచనా ప్రకారం ప్రపంచ ఫైనల్ కు భారత్, న్యూజిలాండ్ రెండు జ‌ట్లు వస్తాయని అంచ‌నా వేశారు.

2011 తర్వాత మరోసారి భార‌త్ ప్రపంచ విజేత కాబోతుంద‌ని తన అంచనా వెల్లడించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు కూడా పుంజుకున్నాయని తెలిపారు. ఇక 2011లో భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న వెంటనే టీం తో కలిసి తాను సంబరాలలో పాల్గొనటం ఎప్పటికీ మర్చిపోలేదని.. గత జ్ఞాపకాలు కూడా వెంకీ గుర్తు చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news