Newsయూఎస్‌లో ' భ‌గ‌వంత్ కేస‌రి ' రోర్‌... బాల‌య్య దెబ్బ‌తో క‌లెక్ష‌న్ల...

యూఎస్‌లో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ రోర్‌… బాల‌య్య దెబ్బ‌తో క‌లెక్ష‌న్ల సునామీ..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీల‌క‌ పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “భగవంత్ కేసరి”. భారీ అంచనాల మ‌ధ్య దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లో వైవిధ్యంగా తెర‌కెక్కింది.

అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత బాల‌య్య న‌టించిన సినిమా ఇది. అటు అనిల్ రావిపూడి కూడా వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఉండడంతో భ‌గ‌వంత్ కేస‌రిపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ డే సాలిడ్ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. యూఎస్‌లో అయితే రోరింగ్ రెస్పాన్స్ ప్రీమియర్స్ కి అందుకోగా లేటెస్ట్ గా ఈ సినిమా 6 లక్షల మార్క్ ని దాటేసింది.

ఇక ఇప్పుడు 1 మిలియన్ డాల‌ర్ల‌ దిశగా అయితే దూసుకెళ్తుంది. ఇది బాలయ్య కెరీర్ లో మరో సాలిడ్ ఓపెనింగ్‌గా ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news