Newsబాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ నై... మ‌హేష్ ఫ్యాన్స్ సై...

బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ నై… మ‌హేష్ ఫ్యాన్స్ సై ..!

నట‌సింహ నంద‌మూరి బాలకృష్ణ పవర్ఫుల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా భగవంత్‌ కేసరి. యంగ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. యంగ్ అందాల బ్యూటీ శ్రీలీల కీల‌క‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ సినిమాపై భారీ హైప్ పెంచిన మాట వాస్తవం. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్‌ కేసరి గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమాకు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి సపోర్ట్ వచ్చే దాఖలాలు అయితే కనపడటం లేదు. ఇప్పటికే ఇటు బాలయ్య, టిడిపితో జూనియర్ ఎన్టీఆర్ దూరం పాటిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. ఇదే విషయాన్ని బాలయ్య దగ్గర ప్రస్తావిస్తే ఐ డోంట్ కేర్ అని కుండబద్దలు కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించినా.. స్పందించకపోయినా ఏం కాదు అన్నట్టుగా బాలయ్య మాట్లాడేశారు.

ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా బాలయ్య సినిమాను పట్టించుకునే పరిస్థితి లేదు. అటు చంద్రబాబు జైలులో ఉంటే ఎన్టీఆర్ కనీసం స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడలేదు. అంటే ఎన్టీఆర్ దీనిని లైట్ తీసుకున్నట్టు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు బాలయ్య సినిమాను అంతే లైట్ తీసుకోమన్నారు. అయితే విచిత్రంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం భగవంత్‌ కేసరికి బాగా ప్రమోట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు అభిమానుల పేజీలలో ఈ సినిమా గురించి పాజిటివ్గా ట్రెండింగ్ నడుస్తోంది. ఇక అక్టోబర్ 8న రిలీజ్ చేసే ట్రైలర్‌ను కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేస్తారు అన్న టాక్ అయితే వచ్చింది. ఇదే జరిగితే ఈ సినిమాకు మహేష్ బాబు ఫ్యాన్స్‌ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండటంతో పాటు రేపు రిలీజ్ అయ్యాక కూడా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి. సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తుండగా.. శ్రీరామ్‌ ప్రసాద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news